స్నేహం-అదీబా- ఆరవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-6302411016

 తెలివైన బాలుడు
                   అనగనగా శంకరంపేట అనే ఊరు ఉంది. ఆఊరి అడవిలో చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసెలో మమత, నరేష్ అనే తల్లిదండ్రులు ఉండేవారు. వారికి మణిదీప్ అనే కుమారుడు ఉండేవాడు. ఒకరోజు వారంతా కలిసి పక్కనే గుట్ట మీద జాతరకు వెళ్లారు. జాతరలో మణిదీప్ చక్కగా ఆడుకున్నాడు.
              సాయంత్రం వరకు తల్లిదండ్రులతో మణిదీప్ గుట్ట పైననే ఉండి కొన్ని బొమ్మలు కొనుక్కున్నాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నారు. దారిలో ఒక చెట్టు కింద తెలిసిన వెంకీ అనే ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. మణిదీప్ మెల్లగా వెంకీ దగ్గరికి వెళ్లి తాను కొనుక్కున్న బొమ్మల్లోంచి ఒక బొమ్మ ఇచ్చారు. వెంకీ ఏడుపు మానేశాడు. మణిదీప్ బొమ్మను వెంకీకి ఇవ్వడం చూసిన తల్లిదండ్రులు మమత, నరేష్ లు సంతోషించారు. చిన్నప్పటినుంచే ఇలా సహాయం చేయడం కొడుకు మంచితనంగా భావించారు.
నీతి: చిన్నచిన్న సాయంతో ఇతరులలో మార్పు తేవచ్చు.

కామెంట్‌లు