వలలో కోతి;- సహస్ర-ఆరవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-7675037407

  ఒక ఊరిలో రాము, రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ బడికి వెళ్ళుతుంటే ఒక వలలో కోతి చిక్కుకొని ఉంది. వారిద్దరూ అతి కష్టం మీద వలలో చిక్కుకున్న కోతిని బయటకు తీశారు. కానీ వల లోపల కోతికి దారాలు తట్టుకోవడం మూలంగా కాలుకు గాయమైంది. వారిద్దరూ కోతి దగ్గరకు వెళ్ళాలంటే భయపడుతూనే నెమ్మదిగా నెమురుతూ కోతి గాయానికి మందు పసరు పోశారు. కొద్ది రోజులకు కోతి గాయం నయం అయింది. తరువాత కోతి మాత్రం వారిద్దరితో ఉంటూ తిరగసాగింది
                 ఒకరోజు రాజు, రాము బడికి వెళ్తుంటే దొంగలు వచ్చి, వారిద్దరిని ఎత్తుకొని పోవాలనుకున్నారు. కానీ కోతి  దొంగలను గమనించి, దొంగల ఒళ్ళంతా గాయపరిచి రాజు, రాములను రక్షించింది. ఇలా దొంగల బారి నుంచి రక్షించిన విషయం తెలుసుకున్న ప్రజలు అప్పటి నుంచి జంతువులను కూడా మంచిగా చూసుకోసాగారు. జంతువులు కూడా ప్రజలతో కలిసి ఉండసాగాయి.

కామెంట్‌లు