ఆపదలో ఆలోచన;- కీర్తన-ఆరవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9010214106
 అనగనగా నాగిల్ల అనే ఊరిలో భానుప్రియ, సహస్ర  అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసి ఉండేవారు. ఒకసారి అనుకోకుండా ఇద్దరు దొంగలు వారిని చూసి ఎత్తుక పోవాలని అనుకున్నారు. దొంగలు సమయం కోసం చూస్తున్నారు. భానుప్రియ, సహస్ర ఇద్దరు కూడా దొంగల రాకను గమనించారు. దొంగలు ఎలాగైనా మనల్ని ఎత్తుకుపోతారు అనుకున్నారు.
               ఇద్దరూ ఎలాంటి కంగారు లేకుండా మామిడి చెట్టు దగ్గరికి వెళ్లారు. దొంగలు కూడా వారి వెనకాల వస్తున్నారు. మామిడికాయలు రాలగొట్టడానికి రెండు రాళ్లు తీసుకుని వెనకాల తిరిగి దబిమని అని దొంగలను కొట్టారు. రాళ్లు సరిగా దొంగల తలకు తగలడంతో అబ్బా అంటూ కింద పడ్డారు. మామిడికాయల కోసం తెచ్చుకున్న ఉప్పు కారం ఇద్దరు దొంగల కండ్లకు పూసి దొంగలు దొంగలు అని అరిచారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. భానుప్రియ, సహస్ర తెలివికి అందరు మెచ్చుకున్నారు.

నీతి: ఆపద వచ్చినప్పుడు ఆలోచనలతో బయటపడాలి
కామెంట్‌లు