స్నేహితులు;-అనీల్-ఆరవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9542600647

     అనగనగా ఒక ఊరిలో శ్రీనివాస్ సునీల్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ కలిసి మెలిసి ఉంటూ తిరిగేవారు. బడిలో ఆరవ తరగతి చదువుతూ ఒకే దగ్గర ఉండేవారు. బాగా చదువుకునే వారు బాగా మాట్లాడేవారు. ఒకరు అంటే ఒకరికి చాలా ఇష్టం. 
                ఒకరోజు సునీల్ కు దెబ్బ తగిలింది. పాఠశాలలో ఉపాధ్యాయుడు గాయానికి మందు పూసి ఇంటికి పంపాడు. గాయం పెద్దది కావడం మూలంగా వారం రోజులపాటు సునీల్ బడికి రావడం లేదు. ప్రతిరోజు పాఠశాలకు వచ్చిన శ్రీనివాస్ ఇంటికి వెళ్లగానే సునీల్ వద్దకు వెళ్లి పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పిన పాటల నుంచి జవాబులు రాయించాడు. వారం తర్వాత ఇద్దరు బడికి వస్తుంటే చాలా సంతోషించారు. 
------------------------------------------------
నీతి: స్నేహితులు కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటుంది.
కామెంట్‌లు