సలహా;- కందుల సహర్షిని-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9885668665

 అనగనగా రాజంపేట అనే గ్రామంలో రమేష్, రాజమణి అనే దంపతులు ఉండేవారు. వాళ్లకి సంపత్, సంజన అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంపత్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. సంజన ఏడో తరగతి చదువుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ చదువు చదవాలని సంపత్ అనుకుంటాడు. 

                తాను పై చదువులు చదవాలని తల్లిదండ్రులకు సంపత్ చెప్తాడు. పట్నంలో నిన్ను పై చదువులు చదివించాలంటే మా దగ్గర అన్ని డబ్బులు లేవని తల్లిదండ్రులు చెబుతారు. సంపత్ చాలా బాధపడుతాడు. చేసేది లేక సంపత్ పొలం పనులకు వెళ్ళసాగాడు. 

                 ఒకరోజు అశోక్ మాస్టర్ సంపత్ పొలం పనులకు వెళ్లడం చూస్తాడు. తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించుకొని సంపత్ చక్కగా చదువుతాడు. అతనిని పై చదువులకు పంపించండి. డబ్బులకు ఇబ్బంది అయితే తాను ఇస్తాను అంటాడు. తల్లిదండ్రులు బాగా ఆలోచించి ఎక్కువ కష్టపడి అయినా సరే సంపత్ ను చదివిపించాలని నిర్ణయించుకుని పట్నం పంపిస్తారు. సంపత్ బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం పొందుతాడు. రమేష్, రాజమణి, సంజన తో పాటుగా గ్రామస్తులు ఆనందపడతారు. అశోక్ మాస్టర్ సలహా సంపత్ జీవితాన్ని మార్చిందని సంతోషిస్తారు.


నీతి:  మంచి దారి చూపించేవారి సలహా ఎప్పుడు పాటించాలికామెంట్‌లు