నాన్నంటే ఇష్టం- ముడావత్ శిరీష-తొమ్మిదో తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9948307160

 అచ్చమైన భాష తెలుగు
నాన్న ఉంటే మన జీవితమంత వెలుగు
ప్రయాణానికి చేరుకోవాలి గమ్యం
నాన్న లేని బ్రతుకు శూన్యం   
చదువు లేని బ్రతుకు నష్టం 
నాన్న లేని జీవితం కష్టం   
పరిపాలించే రాజు కన్నా 
ప్రేమించే నాన్న మిన్న     
ప్రేమకు అపురూపం నాన్న 
నా ప్రతి మలుపు నడిపించేది నాన్న      
మెట్టు మెట్టులో కష్టం 
నాన్న లేని బ్రతుకు నష్టం
పూజకు కావాలి పువ్వులు 
నాకళ్ళకు కావాలి నాన్న నవ్వులు

కామెంట్‌లు