పట్టుదల- మాలోత్ నిఖిత-తొమ్మిదో తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9948307160

      అనగనగా రామాపురం అనే చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో మల్లయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి లత అనే కూతురు ఉంది. లత పాఠశాలలో చదువుకుంటుంది. పాఠశాలలో మాస్టర్ బోధిస్తూ ఢిల్లీ చూడదగిన ప్రదేశం అంటూ ఢిల్లీ గూర్చి చాలా గొప్పగా చెప్పాడు. లతకు ఢిల్లీ చూడాలన్న ఆశ పుట్టింది. 

               ఆరోజు రాత్రి లత తాను ఢిల్లీ చూడాలని తండ్రి మల్లయ్యతో చెబుతుంది. నేను నీకు ఢిల్లీ చూపించలేను. అంత స్థాయి నాకు లేదు. కావాలంటే నీకు బాగా చదువు చెప్పిస్తాను. బాగా చదువుకుని, ఉద్యోగం పొందాక ఢిల్లీకి వెళ్దువులే అన్నాడు. తండ్రి మాటలు లతకు బాగా మనసులోకి ఎక్కాయి. ఎలాగైనా తాను ఢిల్లీ వెళ్లాలని పట్టుదల దృఢంగా ఉంచుకుంది. 

            తాను బాగా చదువుకుంటూ పై చదువులు పట్నంలో చదివి ఉన్నత ఉద్యోగం పొందింది. తాను ఢిల్లీ వెళ్లడమే కాకుండా తండ్రిని కూడా తీసుకువెళ్లి చూపించింది. చిన్నప్పుడు ఢిల్లీ చూడాలన్న ఆశ లత జీవితాన్ని మార్చేసిందని గ్రామస్తులు సంతోషించి తమ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే వారికి ఉన్న ఆశ వైపు పంపసాగారు.

-----------------------------------------------------


నీతి: పట్టుదల ఉంటే మన ఆశను నిలబెట్టుకోవచ్చు.


కామెంట్‌లు