పర్యావరణం;- -యం. అక్షయ-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9959730286
  అనగనగా అంతగిరి అనే ఊరిలో కాంతయ్య, సావిత్రి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి రవి, రోజా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ పొలం పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. బిడ్డలను బడికి పంపించి బాగా చదివిపించేవారు. కాంతయ్య పొలం పనులు కష్టించి సొంతంగా చేసేవాడు. కానీ గ్రామస్తులు ట్రాక్టర్లు, మిషన్లు తెచ్చి వాడుతూ డబ్బులు వృధాగా ఖర్చు చేసేవారు. అలాగే ప్లాస్టిక్ కూడా వాడేవారు. గ్రామంలో రకరకాల ఫ్యాక్టరీలు కూడా ఏర్పడసాగాయి.
       ప్లాస్టిక్ మరియు ఫ్యాక్టరీల మూలంగా కాలుష్యం ఎక్కువగా ఏర్పడి చెరువు నీటి కలుషితమైనాయి. అందువల్ల జంతువులు కూడా చనిపోసాగాయి. కాంతయ్య బాగా ఆలోచించి గ్రామస్తులందరిని పిలిపించి ఫ్యాక్టరీల మూలంగా ఏర్పడే కాలుష్యం గురించి చెప్పి ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని అన్నాడు. కానీ కాంతయ్య మాటలను పెడచెవిడ పెట్టిన గ్రామస్తులు వారు మాత్రం అలానే ప్లాస్టిక్ వాడుతూ ఫ్యాక్టరీల తయారీ యంత్రాలతో వ్యవసాయం చేయసాగారు. 
     

 కొంతకాలానికి చుట్టూ పచ్చని పంటలు, చెట్లు కూడా చనిపోసాగాయి. అప్పుడు గ్రామస్తులు తమ తప్పును తెలుసుకొని, కాంతయ్య వద్దకు వెళ్లి కాంతయ్య సలహాతో ప్లాస్టిక్ నిషేధించి ఫ్యాక్టరీలు మూసివేయించారు. మళ్లీ కొద్ది రోజుల్లోనే గ్రామం పచ్చగా మారి, కష్టపడుతూ వ్యవసాయం చేయడం మూలంగా పంటలు బాగా పండాయి. కాంతయ్య చాలా సంతోషించాడు.


కామెంట్‌లు