అనగనగా నాగపూర్ అనే ఒక ఊరిలో నరసయ్య, నరసవ్వ దంపతులు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కూతురు సీత. సీతా వాళ్లది చాలా పేద కుటుంబం. సీత వాళ్ళ అమ్మానాన్న పొలం పని చేస్తూ ఇంటిని పోషిస్తున్నారు. అలాగే సీతను కూడా చదివిపించసాగారు. సీతా బాగా చదువుకుంటూ పాఠశాలలో మొదటి స్థానంలో నిలుస్తుంది. పేద కుటుంబం కావడం మూలంగా పదవ తరగతి తర్వాత ఏం చేయాలి అని సీత ఆలోచించసాగింది.
ఒకరోజు సీత పొలం పనులకు వెళుతుంది. సీతను చూసిన ప్రసాద్ సార్ చాలా బాధపడుతాడు. ఎలాగైనా తాను సీతను చదివిపించాలని అనుకుంటాడు. తాను డబ్బులు ఇస్తే సీత చదువుకోదని తన మిత్రుల సహకారంతో కొంత డబ్బు ప్రోగు చేసి సీతకు ఇస్తారు. సీత బాగా చదువుకుంటుంది. వీలైనప్పుడు పొలం పని, ఇంట్లో పనులు కూడా చేయసాగింది.
తల్లిదండ్రులే కాకుండా ఇతరులు కూడా చదువుకు సహాయం చేయడం పట్ల సీత ఎంత కష్టమైనా ఇష్టంగా చదువుకొని ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదిస్తుంది. తన చదువు కోసం సహాయం చేసిన ప్రసాద్ మాస్టర్ మిత్రుల విలువ తెలుసుకొని తాను సంపాదించిన డబ్బులలో కొంత తన గ్రామంలోని పేద విద్యార్థులకు ఇచ్చి చదివించసాగింది. సీతను స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా చదువుకుని ఉద్యోగాలు పొందసాగారు.
నీతి: ఎంత కష్టమైనా ఇష్టంగా చదువుకుని, పొందిన ప్రోత్సాహానికి తిరిగి సహాయంతో గౌరవించాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి