ఆడపిల్ల;- బోయిని నిత్యలహరి-ఎనిమిదో తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9963502369
 నేను ఓ ఆడపిల్లని 
చదువులో సరస్వతి దేవిని
ఆకలైన వారికి అన్నపూర్ణ దేవిని 
చెడ్డవారికి కాళికాదేవిని
మంచివారికి భూదేవిని 
కష్టాలలో ఉన్న వారికి కనకదుర్గాదేవి 
సంతోషాలలో ఉన్న వారికి పార్వతీదేవిని 
పేదవారికి లక్ష్మీదేవిని 
నేను ఒక ఆడపిల్లని 
చులకనగా చూసే వారికి ఆదిపరాశక్తినికామెంట్‌లు