రైతు గౌరవం;- యం.పూజ-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా

   భీమ్గడ్ అనే ఊరిలో రామాచారి అనే ఒక రైతు ఉండేవాడు. రామాచారి చాలా మంచివాడు. అతని దగ్గర డబ్బులు లేకున్నా ఉన్నకాడికి అడిగిన వారికి సహాయం చేసేవాడు. తాను వ్యవసాయం చేసి పండించిన ధాన్యం గిర్నిలో పట్టించి వచ్చిన బియ్యంతో రోజులు గడిపేవారు. 
               రామాచారి స్నేహితుడు రాజశేఖర్ ఒకరోజు పట్నం నుంచి ఊరికి వచ్చి, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఏరా రామాచారి నీదగ్గర ఏమున్నాయి అంటూ అన్నాడు. రామాచారితో పాటు అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. రాజశేఖర్ మాత్రం నవ్వుతూ కూర్చొని కాలు మీద కాలేసుకుని కాళ్లు ఊపుతున్నాడు.
                   రామాచారి బాగా ఆలోచించి ఇంట్లోకి వెళ్లి తట్టలో బియ్యం తెచ్చి, ప్రజలకు తలా కొంత పంచిపెట్టాడు. ప్రజలంతా దండాలు బాబు అంటూ రామాచారికి నమస్కరించి వెళ్లారు. రాజశేఖర్ ఆలోచనలో పడ్డాడు. మనిషికి డబ్బు ముఖ్యం కాదు. తినడానికి ధాన్యం ముఖ్యమని, ధాన్యం పండించిన రైతు ముఖ్యమని గ్రహించాడు. తన తప్పుకు క్షమించమని రామాచారిని అడిగాడు. రామాచారి రాజశేఖర్ ను దగ్గరకు తీసుకుని రైతు కుటుంబాన్ని ఎప్పుడు గౌరవించాలి. డబ్బులతో పోల్చకూడదు అని అన్నారు. అప్పటినుంచి రాజశేఖర్ లో మార్పు వచ్చింది. రైతులు ఎక్కడ కనిపించినా గౌరవించసాగాడు.
=======================================
నీతి: రైతులను గౌరవించినవారె నిజమైన మనుషులు
కామెంట్‌లు