పేద విద్యార్థులకు 200 అట్లాస్ (భౌగోళిక పటం) ల పంపిణీ;- KVM వెంకట్ మొలక ప్రతినిధి
 కిసాన్ బంద్ , విద్యావంతుల వేదిక మరియు సేల్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో  ఉన్నత పాఠశాలలు చౌదర్పల్లి కేజీబీవీ,చెట్టుపల్లి తండా ఆశ్రమ పాఠశాల బొట్లవని తండా, గర్ల్స్ కొడంగల్ విద్యార్థులకు రెండు వందల మందికి అట్లాస్ బుక్కులు ఇంగ్లీష్, తెలుగు మీడియం. పుస్తకాలను విద్యార్థులకు అందించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు మాట్లాడుతూ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యల కుటుంబాలకు ఒంటరి మహిళలకు పేద విద్యార్థులకు.2004 నుంచి వారికి అనుగుణంగా సహాయ సహకారాలు చేస్తున్నామని తెలియజేశారు.పేద విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు తెలియజేస్తూ రానున్న రోజుల్లో విద్యార్థులకు పూర్తి సహకారాలు అందించడంతోపాటు విద్యా వృద్ధికి తోడ్పడతామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, జెడ్పిహెచ్ఎస్ పాఠశాలశాల చౌదర్పల్లి శ్రీ హరి రెడ్డి విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ జిల్లా కార్యదర్శి బాకారం చంద్రశేఖర్ కోశాధికారి గౌరారం గోపాల్ తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు