కవిత్వం;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871.
కవిత్వాన్ని స్పృశిస్తాను నేను
దప్పికతీరా తాగుతా క్షణక్షణం

మనసుకూ దేహానికీ పునఃశ్శక్తి కవిత్వం
ఆలోచనకూ ఆరోగ్యానికీ పరమ ఔషధం

గాలీ ధూళీ తడి వెలుగు చీకటి
మనిషీ సమాజమూ అన్నీ కవిత్వవస్తువులే చూస్తే రాస్తే

కవిత్వం బతుకు 
బతుకైన కవిత్వంలో

(ప్రపంచ కవితాదినోత్సవం సందర్భంలో)
కామెంట్‌లు