తిరుపతిలో 24 న శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్యర్యంలో పంచరవళి పుస్తక ఆవిష్కరణ సభ
 అంతర్జాతీయoగా గుర్తింపు పొందిన శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో డా.కత్తిమండ ప్రతాప్  గారి సారథ్యంలో ఎస్ వి బ్లాక్ ఆడిటోరియం నందు జానపద స్వరగానo కార్యక్రమం జరగనున్నది. ఇందులో ప్రముఖ రచయిత్రి ధనాశి ఉషారాణి గారు రచించిన నూతన పద్యప్రక్రియ పంచరవళి శతకoను ప్రముఖుల చేతులు మీదుగా ఆవిష్కరణ జరుగనున్నదని తెలియజేసారు పుస్తక సమీక్షను నాయకంటి నరసింహ శర్మ తెలంగాణ వారు చేయనున్నట్టుగా రచయిత్రి ధనాశి ఉషారాణి తెలియజేసారు తెలంగాణ ఆంద్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ల నుండి 150మంది కళాకారులు పాల్గొననున్నారు .జానపదంకి పట్టాభిషేకం చేస్తూనే కనుమరుగవుతున్న పల్లెజానపదులను సజీవంగా సాహిత్యంలో నిలపాలనే తపనతో కార్యక్రమంను  శ్రీ శ్రీ కళావేదిక జిల్లా కార్యదర్శి అరవ జయపాల్ శ్రీకారo చుట్టడము జరిగింది.కార్యక్రమంకు ముఖ్య అతిధులుగా వి .సి శ్రీకాంత్ రెడ్డి గారు కలెక్టరు లక్ష్మీ శ గారు ప్రొఫెసర్ డా.బత్తల అశోక్ కుమార్ గారు శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ గుత్తా హరి సర్వోత్తమ నాయుడు గారు ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీకాంత్ గారు విచ్చేయనున్నారు.అనేక సామాజిక సేవ కార్యక్రమంలును చేస్తూనే నూతన ప్రక్రియలు తో సాహిత్యంకుoకు ప్రత్యేక స్థానంను కల్పిస్తున్నారని ధనాశి ఉషారాణి ని డా.కత్తిమండప్రతాప్ గారు అభినందించారు.డా. టి మాలకొండయ్య డి.లిట్ విశ్రాంతి ప్రొఫెసర్ గారు  ప్రత్యేక  ఛందస్సు తో నూతన ప్రక్రియను రూపొందించడం పట్ల ధనాశి ఉషారాణి కి అభినందనలను తెలియజేసారు.
కామెంట్‌లు