సీసమాలిక.;- "సాహితీసన్మిత్ర"; "పద్యప్రవీణ" కట్టరంజిత్ కుమార్- సిద్ధిపేట- చరవాణి :- 6300474467
 "మహాశివరాత్రి పండుగ-శివసంబంధ పేర్లతో శివస్తుతి"!!!
----------------------------------------------------------------------------
శంకరా!యీశ్వరా!సాంబసదాశివ
గౌరీమనోహర,గరళకంఠ
మల్లికార్జునస్వామి,మన్మథసంహార
శితికంఠ,నెలతాల్పు,సిద్ధనాథ
భస్మదారీ,వీరభద్ర,రుద్రా,హర
నాగభూషణప్రియ,నగజపత్ని
ముక్కంటి,శివశంభు‌‌,ముజ్జగములనేలు
అభిషేకప్రియవర,అంబరీష
అర్థనారీశ్వరా,యస్థమాలి,శశాంక
కాలకంఠ,యుమేశ‌,కల్పవృక్ష
విశ్వనాథ,విధేశ,విశ్వేశ్వర,యజంత
హరహరమహదేవ,యండధరుడ
పరమేశ,పూర్ణేశ,ప్రళయంకరా,భద్ర
బాలచంద్ర,భగాలి,వైద్యనాథ
అక్షతవీర్యుండ,యచలేశ,యజ్ఞేయ
కామారి,కామేశ ,కాశినాథ
జగదీశ,జమదగ్ని,శశిధర,చంద్రేశ
పశుపతినాథ,ప్రభాకరుండ
భూతనాథ్,మంగలేశ్ ,భూతమహేశ్వరా
నందీశ,నటరాజ,నందికేశ
తారకేశ,త్రిపురారి,మృత్యుంజయ,
విషకంఠ,విషపాయి‌‌,విస్ఫులింగ
మంచుకొండనివాస,మారేడుదళలోల
శ్రీకాళహస్తీశ,శేఖరుండ
అనిరుద్ధ,యర్థేశ,యాత్రేయ,కేదార,
అరుణాచలేశ్వరా,యష్టమూర్తి
(తే.గీ.)
యెన్నినామాలు"శివనీకు‌";యెన్నిమార్లు
పిలుతునోరారనెప్పుడు,ఫలితమొసగి
మోక్షమందించరావయ్య,పురహరుండ
ఆదిభిక్షుండఫాలాక్షుడాదిదేవ!!!
కామెంట్‌లు