701 వ శ్లోకంలో నాలుగు భుజాలు కలిగిన అవతారాన్ని మన ముందు ఉంచారు అది వారి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండడంతో ఆ శ్లోకాన్ని తీసివేసి గీతను 700 శ్లోకాలతో రాశారు అని దానిని మాత్రమే ప్రచారం చేశారు ఇంతకు దానిలో ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే మొదటి శ్లోకంలోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న పదాలతో ప్రారంభించాడు ధర్మము అ ధర్మము ఈ రెండు బేధాలను చెప్పడమే ఆయన ధ్యైయం సర్వ ధర్మాన్ పరితద్య అనే దానితో ముగించాడు అంటే గీత ధర్మంతో ప్రారంభమై ధర్మంతోనే ముగిసింది నీకు ఏది ధర్మమో దానిని చెప్పడం కోసం మాత్రమే 18 అధ్యాయాలలో 18 విషయాలను పూసగుచ్చినట్లుగా మానవుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో మన ముందు భగవద్గీతను ఉంచారు.దానిని బాల్యంలోనే పాఠ్యాంశంగా పిల్లలకు చెప్పినట్లయితే వారికి ఆ శ్లోకాలు అర్థం కావు కనుక దానిని వారికి అర్థమయ్యే భాషలో ఉదాహరణలతో పాటు చెప్పినట్లయితే ఈ భూ ప్రపంచం మీద ఎలాంటి చెడు కార్యక్రమాలు మనకు కనిపించవు శ్రీరామచంద్రుడు ఏ ధర్మాన్ని ఎలా పాటించాడో అలా ప్రతివాడు పాటిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ రెండు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ కాదు ముఖ్యం కృష్ణుడు అర్జునుడు వీరు నామమాత్రం శంకరాచార్యుల వారికి జీవితం ముఖ్యం జీవితమనే శబ్దానికి జీవి తనువుతో కలిసి ఉన్నది అని అర్థం అద్వైత సిద్ధాంతానికి ఇది ప్రతీక జీవి వేరు శరీరం వేరు అనుకునేవారికి అభేదం తెలియజేసిన వాడు ఆచార్యులవారు మమ పాండవ అనేది మొదటి శ్లోకంలో ఉన్న మాట మమ అంటే అహం లోపల జీవి పాండవ పంచభూతములతో ఏర్పడిన శరీరం ఈ రెంటి కళ అయితే జీవితం.ఇవాళ చంటి పిల్లగా ఉన్న బేబీ వయసు పెరిగి వివాహమై అత్తారింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగానే కనిపిస్తారో అక్కడ నిజానికి ఇంట్లో వారెవరో బయటి వారెవరో కూడా తెలియదు ఆప్తులు అయినవారు స్నేహితులు ఎవరెవరు వస్తూ ఉంటారు ఎవరెవరు వెళుతూ ఉంటారు ఎవరికి అలాంటి మర్యాదలు చేయాలో ఏ ఒక్క విషయంలోనూ అవగాహన ఉండని వయస్సు భర్త ద్వారా ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ ముందు ఇంట్లో ఉన్న ఆడవారిని అందరినీ తన వారిగా చేసుకునే ప్రయత్నం చేస్తుంది తరువాత తరచుగా తమ ఇంటికి వస్తూ వెళుతూ ఉన్న వారి పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకుంటూ వారితో సక్రమంగా మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి చాలా దగ్గరగా ఉంటుంది.
.
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి