హనుమంతుడు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 తన యజమాని  ఏ సమయంలోనైనా అధైర్యంతో ఉన్నప్పుడు  ధైర్యాన్ని నూరిపోయవలసిన ధర్మం సేవకుని పై ఉన్నది. సేవకుడు అంటే వెట్టిచాకిరి చేసేవాడు మాత్రమే కాదు యజమాని సుఖ సంతోషాలను  పెంచేలా తన సేవలను కొనసాగించేవాడు  అప్పుడు అంటాడు ఆంజనేయస్వామి  స్వామి తొందరపడి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు మీరు ఇక్కడే ఉండండి  నేను వెళ్లి ఆ ఇద్దరు ఎవరో ఎందుకు వచ్చారో వారి పూర్వపరాలని తెలుసుకుని వస్తాను  అక్కడ మన విరోధివర్గం ద్వారా  లేదు వేరే కార్య  నిర్వహణలో ఈ ప్రాంతానికి వచ్చారా అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత చేయవలసిన పని ఏమిటో మనం చేద్దాం  నేను బయలుదేరుతున్నాను నేను వచ్చేంతవరకు మీరు ఇక్కడే ఉండండి అని వాడికి ధైర్యం చెప్పి  రామలక్ష్మణుల వద్దకు వస్తాడు ఆంజనేయ స్వామి  రామాయణంలో వారి  ప్రవేశం అంత అందంగా వర్ణించాడు వాల్మీకి మహర్షి అందుకే ఆ గ్రంథానికి శాశ్వతత్వం వచ్చింది. అంజనీ దేవి కుమారుడైన ఆంజనేయ స్వామి లేకుంటే  రామాయణానికి వెన్నుపూస లేకుండా ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు  అంత ప్రధానమైన పాత్ర  వహించిన  బుద్ధిమంతుడు కనుకనే ఆయన పేరు హనుమంతుడు అనే పిలుస్తారు. ఎలాంటి మేధావులు యైనా ఒక్కొక్కసారి  తప్పుగా ప్రవర్తించే  పరిస్థితులు ఎదురవుతాయి  అది తెలియక  అమాయకత్వంలో కావచ్చు  లేదు ఎదుటి స్థితిని చూసి    తన్మయత్వంలో  తనను తాను మర్చిపోయే స్థితి కూడా కావచ్చు  రామలక్ష్మణులను చూడగానే హనుమంతుడు వారి స్థితి అది  కనుక తన బుద్ధిని మరచి  మీరు ఎవరు  మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు  మీకు మేము ఏమైనా సహాయం చేయగలమా  మీకు ఏది కావాలంటే అది మేం చేయగలం అని  శ్రీరామచంద్రమూర్తి వారి  మొఖం చూడగానే  విషయాన్ని అర్థం చేసుకొని  స్వామి నన్ను క్షమించండి  నా పేరు ఆంజనేయులు  అంజనాదేవి కుమారుణ్ణి సుగ్రీవునికి బంటును అని తెలియజేయగానే  శ్రీరామచంద్రమూర్తి ఆనందంతో పొంగిపోతాడు  ఆ రోజున వాల్మీకి మహర్షి  ఇవాళ  పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్లు  ఫోనులో ఉపయోగించే వినియోగదారులకు ఇచ్చే మొదటి హెచ్చరిక  మొదట మీరు ఎవరో చెప్పి ఆ తరువాత ఎదుటివారిని గురించిన వివరాలను అడగండి  అని తెలియజేస్తారు. ఈరోజు సభ్య సమాజంలో మనం ఏదైతే చేస్తున్నామో  అవి అన్నీ అటు వాల్మీకి మహర్షి  ఇటు వ్యాసుల వారు చెప్పినవి తప్ప  మనం కొత్తగా తెలుసుకుని చేస్తున్నవి ఏమీ లేవు అని చెప్పడంలో ఎలాంటి  ఆలోచన లేదు.

కామెంట్‌లు