పిల్లల పెంపకం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామంనెల్లూరు.6302811961.
 తర్వాత పిల్లలకు చెప్పవలసినది  నీకు పక్ష విరోధి కావచ్చు  ఎన్నో అకృత్యాలను చేస్తూ, చేసి ఉండవచ్చు  అయినా అతని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు  అతనిలో ఉన్న మంచిని ఎంచి దానిని  స్వీకరించాలి తప్ప చెడును కాదు అయితే ఆ చెడును చెప్పకపోతే అది పెరిగి పెద్దదై  వారి జీవితాలను నాశనం చేయదా అనే ప్రశ్న రావచ్చు  అందుకే మన వారు చెప్పేది  వ్యక్తిని శిక్షించడం కాదు ఆ వ్యక్తిలో ఉన్న  దుర్గుణాలను తీసివేసే పద్ధతిలో చెప్పవలసిన మాటలు చెప్పి  దానివల్ల అతని భవిష్యత్తు ఎంత నాశనం అవుతుందో ఆయనకు అర్థం కావాలి  ప్రత్యక్షంగా తాను అనుభవించిన తర్వాత అలాంటి పిచ్చి పనులు  సమాజ విద్రోహ కార్యాలు  చేయడం మానుకుంటాడు అని మన పెద్దలు చెబుతారు  అదే రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన విషయం.తరువాత తల్లి బిడ్డలకు బోధించవలసిన విషయం ఒకటి ఉన్నది  ఈ ప్రపంచంలో ఎవరినీ ఎవరూ మార్చలేరు  ఎవరి జీవితం వారిదే ఎవరి అలవాట్లు వారివి  తల్లిదండ్రులు మంచి బుద్ధుని నేర్పితే అతను మంచి మార్గంలో నడుచుకుంటూ సమాజానికి మంచి చేస్తాడు  లేదా దుర్మార్గుడు అవుతాడు తన బిడ్డను తల్లి ఎలా పెంచాలనుకుంటుందో దానిని బట్టి ఆలోచించుకోవాలి  పిల్లల స్థితి  ముళ్ళబాటలో నడవాల పూల బాటలో నడవాలా అని తల్లి ముందు గమనించాలి. దానిని దృష్టిలో పెట్టుకొని వారిని ఎలా తీర్చిదిద్దాలో  తల్లి ప్రణాళికాబద్ధంగా  క్రమశిక్షణ అమలుపరుస్తూ ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ దానిని అమలుపరిచిన తర్వాత రెండవ దాన్ని నేర్పుకుంటూ వెళ్ళాలి అప్పుడు పిల్లలు సరైన   బాటలో ఉంటారు. మనోవాక్కాయకర్మలు అని మన పూర్వులు చెప్పిన విషయం  మానసికంగా దేనిని గురించి ఆలోచిస్తామో ఏ మంచి మార్గాన్ని క్రమశిక్షణతో  నడవాలని అనుకుంటామో దానిని మాటలలో కూడా చెప్పాలి  ఏ మాటలలో ఆ కుర్రవాడు చెప్పాడో దానిని తాను అనుసరిస్తున్నాడా లేదా అన్న విషయాన్ని  తల్లి గమనిస్తూ ఉండాలి ఇందుకు ముందు నువ్వు చెప్పిన విషయం ఇది కాదుకదా నాన్నా దీనిని అనుసరిస్తున్నావు ఏమిటి అని తల్లి  బిడ్డను క్రమ మార్గంలో పెట్టాలి  అలా ప్రత్యేక సమయంలో ఆ బిడ్డ ఎందుకు అలా చేశాడో కారణం కూడా తెలుసుకున్నట్లయితే  ఆ బిడ్డకు సరైన మార్గాన్ని సూచించిన తల్లి అవుతుంది  కుర్రవాడు సత్యహరిశ్చంద్రుడిలాగా పెరిగి తన మాట పై తాను నిలబడేట్లుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు

కామెంట్‌లు