ఆరోగ్యం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఏ జీవి అయినా తన కార్యక్రమాన్ని సక్రమంగా చేయాలంటే తన శరీరం తన అధీనంలో ఉండాలి  ఎలాంటి రుగ్మతలు రాకుండా చూసుకోవాలి  అలా చేయాలంటే ముందు దేహశుద్ధి  తప్పనిసరి  ఉదయం లేవగానే చేయవలసిన కార్యక్రమాలు చేసి  శరీరంపై ఎలాంటి మాలిన్యాలు లేకుండా స్నాన  సంద్యాలను నిర్వహించాలి  వీధిలోకి వెళ్లి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి రాగానే  గుమ్మం  అవతల చెప్పులు విడిచి లోపల కు వచ్చి మొదట కాళ్లు శుభ్రం చేసుకోవాలి  లేకపోయినట్లయితే ఆ వీధిలో ఉన్న అనేక రకాలైన రోగ కారక క్రిములు  ఆ కాలి ద్వారా ఇంటిలోకి వ్యాపించి  అవి ఆ గృహంలో ఉన్న మిగిలిన వారికి కూడా  చెడును కలిగించే ప్రమాదం ఉంటుంది  దానిని నివారించాలంటే మనం చేయవలసిన పని  శరీర శుభ్రత. కనిపించిన ప్రతిపదార్థాన్ని తినాలను కోరిక ప్రతి బిడ్డకు ఉంటుంది  ఆ తినే వాటిలో శరీరానికి పనికి వచ్చేవి  వాటిలో జబ్బులు రావడానికి కారణమైనవి ఏమైనా ఉన్నాయా  ఎక్కువ నూనెతో చేసినవి ఉంటే కొవ్వు పెరగడానికి అవకాశం ఉంటుంది కనుక దానిని తగ్గించి ఎంతవరకు కావాలో అంతవరకే వాడాలి  అలాంటి పదార్థాలను తీసుకోవాలి  నాకు ఈ కూర ఇష్టం అని ఆ కూరని ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు  అమ్మ ఏ పదార్థాన్ని రుచిగా చేస్తుందో బిడ్డకు తెలుస్తుంది  ఆ కూర చేసిన రోజున బిడ్డకు ఆకలి ఎక్కువ ఆకుల వల్ల కలుగుతుంది  పెద్దలు చెప్పిన ఒకే ఒక సూక్తి    అతి సర్వత్ర  వర్జయేత్  అతిగా పోకుండా మితంగా తీసుకున్నట్లయితే శరీరంలో ఎలాంటి  అనారోగ్య  సూచనలు ఉండవు. తరువాత తల్లి తీసుకోవలసిన ప్రత్యేక శ్రద్ధ  వంట చేసేటప్పుడు ఒక్కొక్క పదార్థానికి ఒక పాత్ర వాడవలసి ఉంటుంది ఆ పాత్ర ఎలా ఉంది అన్న విషయం అమ్మకు తెలుసు  ఎప్పుడు పాత్రలు పరిశుభ్రంగా ఉండవో  అప్పుడు  ఆ పాత్రలో వండిన పదార్థం కూడా  అనారోగ్యానికి కారణమవుతోంది  ఆ జాగ్రత్తలు తల్లి తీసుకోవాలి    బాంఢ శుద్ధి అని పెద్దది చెబుతారు  పాత్రను మనం శుద్ధిగా శుభ్రంగా ఉంచినట్లయితే  దానిలో వండిన ఏ పదార్థం కూడా  చెడ్డ ఫలితాలను ఇవ్వదు  ఈ విషయం అమ్మకు బాగా తెలుసు  కొన్ని కుటుంబాలలో పనివాళ్లు చేస్తూ ఉంటారు  వారు అంటీ అంటనట్లుగా పనిచేసినప్పుడు దానిని  పర్యవేక్షించి శుభ్రం చేయవలసిన బాధ్యత తల్లి తీసుకుంటుంది. 

కామెంట్‌లు