హనుమంతుడు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఒక్కొక్కసారి అపజయం కూడా జయంగానే కనిపిస్తుంది. హనుమంతుల వారు సీతాన్వేషణకు బయలుదేరి లంకలో ప్రతి ఇంటిని పరిశీలిస్తూ ఏడుస్తూ ఉండగా రావణాసురుని పడకగదికి వెళ్లి  వారి ప్రక్కన సీతమ్మవారు ఉండడం గమనించిన హనుమంతుడు  ఎంత ఆనందించాలో అంత  కోతి చేష్టలతో ప్రారంభించి నేను సీతను చూశాను చూశాను అంటూ  చివరకు తన కోతి లక్షణం తోకను తీసుకొని చివర ముద్దు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. అప్పుడు హనుమ బయటపడతాడు  హనుమ అంటే బుద్ధి అది కలిగిన వాడు హనుమంతుడు  అవును నేను ఇంత ఆనందిస్తున్నాను దీనికి కారణం సీతమ్మ అని అనుకుంటే  ఆ మహా పతివ్రత ఇక్కడ ఎందుకు ఉంటుంది రావణాసురుని శయ్య పైన  నేను చూడడంలో పొరపాటు జరిగిందా అని తిరిగి పరిశీలనగా చూసి ఆమె కాదు అన్న నిర్ధారణకు వచ్చాడు.
ఇక్కడ రెండు విషయాలను మనం గమనించాలి  మొదటిది హనుమ ఏ స్త్రీ నీ పూర్తిగా చూడడు  ప్రతి స్త్రీ తనకు మాతృమూర్తి తో సమానం  మరి సగం సగం చూసిన వాడికి సీతమ్మలా కనిపించింది అంటే శ్రీరామచంద్రమూర్తి సీతమ్మల క్షణాలను గురించి చెప్పిన లక్షణాలు ఆ స్త్రీ మూర్తిలో ఉన్నాయి కనుక  అంటే అక్కడ ఉన్నది  మండోదరి  ఆమె కూడా సీతతో సమానమైన స్థితిలో ఉన్నది అని మనకు అర్థం కావాలి  ఒక సందర్భంలో రావణాసురుని అడ్డగిస్తూ మండోదరి అంటుంది  శీలం లో కానీ ఆకారంలో కానీ బుద్ధిలో కానీ  నాతో పోలిస్తే సీత ఎందుకూ పనికిరాదు ఆమెకు  ఎన్నో రెట్లు అందమైన నేను  నీకు నచ్చలేదా ఆమె వెంట ఎందుకు పడతావు  అని నినదించిన ఘట్టం మనకు కన్నీరు తెప్పిస్తుంది.
అలాంటి సందేహంలో పడిపోయాడు  హనుమాన్  ఆంజనేయస్వామి సర్వ మానవాళికి  వాల్మీకి మహర్షి చెప్పిన నీతి  ప్రతి జీవికి    ఇలాంటి   సంశయం  వచ్చే అవకాశం ఉంటుంది  కంటితో చూసిన విషయం కూడా  నమ్మవద్దు అని చెప్పే నీతి ఇక్కడ  వాల్మీకి మహర్షి పరోక్షంగా మనకు తెలియజేస్తున్నారు  ఒక్కొక్క పర్యాయం మన కళ్ళు కూడా మనకు  సందేహాన్ని కలిగించేలా ప్రవర్తిస్తుంది  కనక ప్రతి వ్యక్తి ఇలాంటి స్థితి వచ్చినప్పుడు  హనుమంతుడిలా తన సొంత బుద్ధిని ఉపయోగించి  ఇది ఇలా ఎందుకు జరిగింది అలా ఉండవలసిందే కదా  అని ఒకటికి రెండు సార్లు ఆలోచించినట్లయితే తప్పకుండా దాని ఫలితం  మన చేతికి అందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు దీనికి ఉదాహరణ హనుమంతుడు.

కామెంట్‌లు