తపశక్తి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఎంతోమంది  తపస్సు చేసి నేను అన్న శబ్దానికి అర్థం ఏమిటి  ఈ నేను ఎక్కడ ఉంది ఎలా ఉద్భవించింది  నేను చేసే పనులు ఏమిటి  అన్న విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవడం కోసమే  అడవులలో ఏకాంత ప్రదేశానికి వెళ్లి మనసును ఏకాగ్రం చేసుకొని  తపోనిష్ట లో కూర్చుంటారు  చివరకు వారు తెలుసుకునేది ఏమిటి  ముందు మనసు అంటే ఏమిటో అర్థం తెలియాలి  శరీరంలో ఈ మనస్సు ఎక్కడ ఉంది ఏదైనా ఒకచోట మాత్రమే ఉంటుందా  పంచేంద్రియాలు అన్నిటిలోనూ  తన శక్తి ప్రభావం కనిపించకుండా ఉంటుందా  ఏదైనా నీవు ఒక వస్తువును చూడాలంటే మనసు లేకపోతే చూడగలవా  రుచి చూడాలన్న వినాలన్నా  మనసు కలుగ చేసుకోకపోయినట్లయితే ఏ పని జరగదు ఈ శరీరానికి
ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవిలోనూ అహం ఉండి తీరుతుంది  నేను అన్న అభిప్రాయం వాడికి లేనట్లయితే ఆ శరీరానికి అర్థం లేదు. నేను అన్న అహం  ఏదైతే ఉన్నదో అది ఆ వ్యక్తిలో అహంకారాన్ని  తెలియజేస్తుంది నాకు ఇది తెలుసు అది తెలుసు నాకు తెలియని విషయం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని  తనకు తెలిసినా తెలియకపోయినా కబుర్లు చెప్పడంలోచతురుడు  అన్న విషయం తెలిస్తే అహంకారం యొక్క అర్థం కూడా తెలుస్తుంది  ఈ పనిని నేను మాత్రమే చేయగలను అని ఎవరు భీష్ముంచుకు కూర్చుంటారు  వారు ఆ పని చేయడానికి ప్రారంభించినప్పుడు తెలుస్తుంది తన ఒక్కడి వల్ల ఈ పని కాదు అని  నీవు చేసే భోజనాల్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే. సామాన్య రైతు  ఆరుగాలం శ్రమించి  ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు పొలం మీదే కష్టపడి  ఎండకు ఎండి వానకు తడిచి  చలికి వణుకుతూ  విత్తునాటి పైరు పెరిగి వడ్ల గింజ బయటికి వచ్చేంతవరకు  మనస్సు శరీరం మొత్తం దాని మీదే  శ్రద్ధ పెట్టిన తరువాత కానీ ఆ వడ్ల కింద ఇంట్లోకి రాదు  ఆ వడ్లను దంచి దానిని బియ్యం గా తయారు చేసి  దానిని వండినా ఫలితం ఉండదు  వట్టి అన్నం  ఎవరు మాత్రం తినగలరు  దానికి తగిన కూర పచ్చడి పెరుగు లాంటి పదార్థాలు ఉండాలి దానికి మళ్ళీ ఉప్పు కారం  పడాలి  దానికి తగినట్లు కొత్తిమీర కరివేపాకు లాంటి ఆకుపదార్థాలు కావాలి దానిని వేయించడానికి నూనె కావాలి  ఇవన్నీ చేయడానికి గృహిణి ఆరోగ్యంగా ఉండాలి ఇంత తతంగం ఉంటే కానీ నీ నోటికి  ముద్ద రాదు.


కామెంట్‌లు