పద ప్రయోగం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 సమాజంలో తిరగడానికి కూడా నీ ఒక్కడివి  ఏమీ చేయలేని స్థితి నీవు బయటకు రావడానికి దుస్తులు కావాలి. దానిని పండించడానికి రైతు కావాలి  ఆ దూదిని దారంగా చేసి వస్త్రంగా తయారు చేయడానికి మరొక వ్యక్తి కావాలి దానికి రంగులు వేయడానికి మరికొంతమంది దానిని నీకు సరిపడిన పద్ధతిలో కుట్టడానికి ఒక దర్జీ  వీరందరి సహకారం లేకుండా వచ్చి మొండి మొలతో సమాజంలోకి రాగలవా నీవు నడవడానికి చెప్పులు ఉండాలి అది నీ వల్ల అవుతుందా  చనిపోయిన జంతువు చర్మాని తీసుకెళ్లాలి దాని శుభ్రం చేయాలి దాని పద్ధతి తెలిసి నీ ఆది తీసుకొని ఒక వ్యక్తి దానిని    తయారు చేయాలి అది అందరి వల్ల అవుతుందా  దానికి ప్రత్యేకంగా  ఆ పద్ధతి తెలిసిన వ్యక్తి ఉండాలి.
వర్షం కూడా నీకు గృహం ఎవరు కట్టారు నీవు  మీ వాళ్ళు కూడా  దానికి శాస్త్రం తెలిసిన ఇంజనీర్ ఉండాలి  పద్ధతి ప్రకారం ఎలా ఉండాలో అతను నిర్ధారించాలి  దానికి గోతులు తీయడానికి కూలీలు కావాలి  దానికి ముడి సరుకు  ఇటుకలు  సిమెంటు లేదా సున్నం  అలాంటి పదార్థాలు కావాలి  దానిని తీసుకురావడానికి  బండ్లు దానికి సకావలసిన సరంజామా  దానిని మేస్త్రీకి అందించడానికి కూలీలు  మొత్తం పూర్తయిన తర్వాత వస్తున్నాడు కొట్టడానికి మరి కొంతమంది ఇంటిలోకి కావలసిన పదార్థాలకు సంబంధించిన  వస్తువులను వెంటనే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి తెచ్చుకుంటూ  అన్నిటినీ కలిపి  జీవితంలో ఏ పదార్థం కూడా చెడిపోకుండా చూసుకుంటూ రకరకాల పనులు చేస్తూ ఉంటే తప్ప  నీకు నిద్ర రాదు. అహం అనేదానికి చావు పుట్టుకలు లేవు  అది శాశ్వతం  ఆదిమధ్యాంతరరహితం అని అంటాం. తాను చావదు  చంపబడదు  అయినా సర్వసాక్షిగా ఉంటుంది అదే  ఆత్మ అదే నీవు అదే నేను  మనకు సత్యం నిజం రెండు పదాలు వేరువేరు అన్న విషయం తెలియదు  సమానార్ధకంగానే మనం వాడుతూ ఉంటాం నిజం అన్నా సత్యం అన్నా ఒక మాట కాదా అని ఎదురు ప్రశ్నిస్తారు విన్న వాళ్లు  కానీ నిత్యం నువ్వు సూర్యుడ్ని చూస్తున్నావు ఉదయం వస్తాడు సాయంత్రం వెళతాడు  ఇది నిజం కాదా  నిజమే కనుక  అది నిజం మాత్రమే  మరి సత్యం ఏమిటి సూర్యుడు నిత్యం ఉంటాడు ఉదయం వచ్చే సాయంత్రం వెళ్లేవాడు కాదు అది ఒక గ్రహం ఆ శాస్త్రీయ దృక్పథం కలగ తెలిసినట్లయితే  ఇలాంటి తలపులకు  అవకాశమే ఉండదు.

కామెంట్‌లు