తనకు తెలియని వయసులోనూ తనకు తెలిసిన వయసులోనూ కొన్ని సంఘటనలు జరగడం సహజం. ఆ జరిగిన వాటిలో కొన్ని మంచి ఫలితాన్ని చ్చేవి ఉంటే మరి కొన్ని చెడ్డ ఫలితాన్నిచ్చేవి ఉంటాయి మంచి జరిగినప్పుడు ఎంతో ఆనందిస్తూ చెడు జరిగినప్పుడు ఎంతో బాధపడుతూ జీవితకాలమంతా దానిని ఆలోచించుకుంటూ మానసికంగా ఇబ్బంది పడడం కొంతమందికి అలవాటు అలాంటి జ్ఞాపకం పెట్టుకోకూడదు జరిగిన మరుక్షణంలోనే దానిని గురించి మర్చిపోవడం తన ఆరోగ్యానికి మంచిది లేకపోతే అనేక రకాల మానసికమైనటువంటి రుగ్మతలు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ ఆలోచన పెట్టుకున్నప్పుడు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది అని పెద్దగా చెబుతారు.తన వయసులో ఉన్న కుర్రవాడు ఏదైనా ఒక చిన్న ఘనకార్యం చేసినట్లయితే దానిని చూసి హర్షించి ఆ కుర్రవాడిని అభినందించాలి తప్ప అయ్యో నేను అది చేయలేకపోయానే అని మదన పడకూడదు నీకు వచ్చిన ఆలోచనకు సరిపడిన పద్ధతులలో నూతన విషయాలను ఇతరులు నేర్చుకునేట్లుగా చేయగలిగిన నేర్పు ఉన్నప్పుడు దానిని సక్రమంగా ఉపయోగించుకొని ఆ కార్యం పూర్తి చేసిన తర్వాత తాను ఆ విజయాన్ని సాధించడానికి కారణాలేమిటో నీ స్నేహితులతో చెప్పినా అది ఆనందించవలసిన విషయమే తప్ప అనవసరంగా ఇతరులు చేసిన పనిని తాను చేయలేకపోతున్నానే అన్న అసూయను మనసులో పెట్టుకొని బాధపడితే ఆరోగ్యానికి చేటు అన్న విషయం చిన్నతనంలోనే అమ్మ చెప్పాలి. ఏ చిన్న విషయం జరిగిన దానిని గురించి అతిగా ఆలోచిస్తూ దానికి పరిష్కార మార్గం తెలియక ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు యవ్వనంలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు అసలు ఆ విషయం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది దాని మూలానికి వెళ్లి కారణాలు తెలుసుకున్నట్లయితే అది అలా జరగడానికి మన ఆలోచన కారణము అన్న విషయం అర్థమవుతుంది అది నీకు ఒక పాఠం ఇలాంటి విషయాన్ని ఆలోచించినప్పుడు అలా చేసి ఉండకూడదు మనం ఆలోచించినట్టుగా చేయలేక పోయినట్లయితే ప్రతికూల ఫలితాలే వస్తాయి తప్ప అనుకూలమైనటువంటి విజయవంతమైన పనిని మనం చేయలేము అన్న విషయాన్ని గమనించినట్లయితే మనకు మానసిక వ్యధ ఉండదు
మంచి ఫలితాలు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి