స్వార్థం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పిల్లలకు తల్లి మొదటి నుంచి  నేర్పవలసిన విషయం  స్వార్థాన్ని గురించి  తన అన్నది  స్వార్థం  మన  నిస్వార్థం  మన పుస్తకాలు మన దగ్గరే ఉండాలి  మన వస్తువులు మన దగ్గరే ఉండాలి  మనకు అవసరమైన వస్తువులు ఏవైతే  డబ్బులు ఇచ్చి కొన్నామో వాటిని మనం ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు  కానీ కొన్ని స్వార్థాలు ఉంటాయి  అది వాడికి ఉన్నది నాకు లేదే అన్న అసూయతో కూడిన స్వార్థం  మంచిది కాదు అన్న విషయం  తల్లి బిడ్డకు చెప్పాలి  మనది కానీ ఏ విషయానికి కానీ  ప్రలోభ పడడం కానీ ఆశపడడం కానీ చేయకూడదు  అది మనది కాదు అంతవరకే నీకు అర్థం కావాలి  నీకు కావాల్సింది  నిత్యజీవితంలో అవసరమైంది నీవు కొని నీ సొంతం చేసుకోవడంలో  నీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు  కానీ ఇతరుల దానికోసం ఆశపడకూడదు  మన స్వార్థం ఇతరుల మనసును కష్టపెట్టకూడదు అన్నది  తెలిస్తే చాలు. దీపం ఎంత ప్రశాంతంగా ఉంటుంది  ప్రమిదలో ఆముదం పోసి ఒత్తి వెలిగించినప్పుడు  ఆ చిన్న వెలుగు  ఆ గది మొత్తాన్ని ప్రకాశవంతం చేస్తుంది  పిల్లలు కూడా అలాంటి దీపాల వలే వెలగాలి  నీ ఆటపాటల్లో ఇతరులకు  ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇతరులు ఆనందిస్తారు  నీకన్నా తక్కువ తెలివి కలిగి పాఠాలు చదవలేని స్థితిలో ఉన్నవారికి నీకు తెలిసిన పాఠాలను వారికి చెబితే  వాడు ఎంతో  ఆనందిస్తారు  మనసు ఏంత అల్లకల్లోలంగా ఉన్న  దానిని స్వాధీన అనపరచుకోవాలి  సముద్రంలో అలలు ఎంత ఘోరంగా పైకి లేచి మళ్ళీ కిందకు వస్తూ ఉంటాయి  చూడడానికి ఎంతో అలజడిగా కనిపిస్తోంది  కానీ ప్రతి అలా  ఎంతో ప్రశాంతంగా  ఒడ్డుకు చేరుతుంది  జీవితాన్ని అలా మలచిపోగలిగినట్లయితే వీరు  దీపాల్లాంటివాడు రా అని మెచ్చుకుంటారు అమ్మానాన్న ఇతరులు కూడా. అమ్మ కానీ నాన్న కానీ  నిన్ను కోపగించుకుంటారు ఒకసారి  నీ వేదైనా మరీ పెద్ద తప్పు చేస్తే  వీపు చిట్ల కొడతాడు  అంతమాత్రం చేత నీ మీద ప్రేమ లేనట్లా  నీవు ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి శిక్ష విధించకపోయినట్లయితే ఆ తప్పే తిరిగి తిరిగి చేసే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి  అలాంటివి జరగకుండా  తల్లిదండ్రులు జాగ్రత్త పడటం కోసం అలా శిక్షణ విధిస్తారు  నీవు దుఃఖిస్తూ ఉంటే మీ అమ్మ ఎలా  కనిపించని బాధను అనుభవిస్తుందో నీవు ఏనాడైనా గమనించావా  నన్ను కొట్టారే అని బాధపడడం తప్ప  ఎందుకు కొట్టారు నేను ఈ తప్పు చేయడం వల్ల కదా  ఇంకా ఎప్పుడు ఈ తప్పు చేయకూడదు అన్న జ్ఞానం కలక వస్తే  వెళ్లి అమ్మకు క్షమాపణ చెప్పి అమ్మ ఒళ్ళు  తలపెట్టి కన్నీరు కార్చు అంతే తప్ప వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోకు.

కామెంట్‌లు