పిల్లల పెంపకం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కొంచెం చొరవ పెరిగిన తర్వాత  ఎవరు తనతో సన్నిహితంగా ఉంటారు వారి గృహాలకు కూడా వెళ్లి వారి ఇళ్లలో ఉన్న మిగిలిన వారిని పరిచయం చేసుకుంటూ  వారందరికీ తలలో నాలుకలామెదులుతూ  మంచి శీల వంతురాలు నలుగురితో కలిసి మెలిసి జీవితాన్ని గడపాలనుకునే సద్గుణాల రాశి అని అందరి ప్రవర్తనను పొందుతూ ఉంటుంది  దానికి ప్రత్యేక కారణం ఆమెలో ఉన్న సహజసిద్ధమైన పరోపకార బుద్ధి  ఏ ఇంటిలో ఎవరికి ఏ కొంచెం ఆపద వచ్చినా వెంటనే వెళ్లి ఏం జరిగింది ఎలా జరిగింది విషయాలు అన్న విషయాలను అన్నిటినీ తెలుసుకొని దానికి పరిష్కార మార్గం ఆలోచించి  తిరిగి అలాంటి పరిస్థితుల్లో రాకుండా ఉండడానికి  తమ వంతు ఎలా  చేయాలో ఏదైనా చిన్న వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని ఎలా  పరిష్కరించుకోవాలో కూడా ఆలోచించుకొని  అందరినీ తన వారిగా చేసుకుంటుంది
ఇలాంటి మనస్తత్వం కలిగిన  స్త్రీలు తమ పిల్లలను కూడా తన కన్నా ఉత్తములుగా  క్రమశిక్షణ కలిగిన వారిగా ఎదుటివారికి సహకరించేలా  చేసే పద్ధతిలో వారిని పెంచుతూ ఉంటుంది  ఎన్నో ఉదాహరణలు చెబుతూ  తనతోపాటు వస్తున్న ఒక పోరగాడు  కళ్ళు తిరిగి లేక ఏ కారణం చేతనో పడిపోయినప్పుడు తన  సంచిలో వల్ల నీళ్ళు అతనికి తాగించి మొహాన కొంచెం నీరు  చల్లి  అతను కొంచెం తేరుకున్న తర్వాత వారి ఇంటికి చేర్చే బాధ్యత తాను తీసుకునేలా  తన కుమారుని తయారు చేస్తుంది  తనతో పాటు   చదువుకుంటున్న కుర్రవాళ్ళలో ఏ ఒక్కరైనా వెనకబడి ఉంటే  అతనిని తన ఇంటికి పిలిపించుకొని తనకు తెలిసిన పద్ధతిలో ఆ కుర్రవాడికి  చెప్పవలసిన రీతిలో అన్ని విషయాలు చెప్పి అతను కూడా  తనతో పాటు తోక గలిగిన స్థితికి తీసుకువచ్చే పరిస్థితిని కలుగచేస్తుంది తల్లి
ఒకప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు  పలకా బలపం తెచ్చుకోమని చెప్పేవారు పిల్లలకు  అక్షరాలను  పలకలపై వ్రాసి  బలపంతో దిద్దుతూ  అక్షరాన్ని పలకమనేవారు  దిద్దిన ప్రతిసారి ఆ క్షణం పలకడంతో అది క్షుణ్ణంగా ఆ ఫోటో వారి మనసులో  ముద్రించబడి ఉంటుంది  రెండు సంవత్సరాలు పోయిన తర్వాత  వారికి ఎక్కాలు చెప్పే  గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు వచ్చి  ముందు రెండవ  ఎక్కంతో ప్రారంభిస్తారు  ఒక రెండు అంటూ 20 వరకు చెప్పి  అది విద్యార్థికి కంఠస్థం వచ్చిన తరువాత  కింద నుంచి పైకి అప్పజెప్పే పద్ధతిని  22-40  తో ప్రారంభించి 19-18  అలా క్రింద నుంచి పైకి  కంఠస్థం చేసే పద్ధతిలో  ఎక్కాలు  చెబుతాడు  నిద్రలో లేపి  అడిగినా చెప్పగలిగిన స్థితికి వస్తాడు ఆ విద్యార్థి.


కామెంట్‌లు