సబల;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఆడది అంటే అందరికీ   అలుసే  స్త్రీని అబల అన్న వారు చాలామంది ఉన్నారు కానీ సబలని ఆవిడ రుజువు చేసుకున్న సందర్భాలు  అనేకం  మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ వాటిని మనం చూడం  తల్లి లేకుంటే మానవ జన్మ లేదు  బిడ్డలకు విద్యాబుద్ధులను నేర్పేది తల్లి  వాడిని తీర్చిదిద్దేది ఆమే సమాజానికి ఉత్తమ పౌరులను అందజేస్తున్నది కూడా ఆమె  వేద పారాయణ చేసిన  వ్యక్తులు వేదం వ్రాసిన  స్త్రీలు ఉన్నారన్న విషయం మనకు తెలియదు  గార్గి లాంటి  మహిషీమణులు ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారు మనకు తెలియదు  ఆమెతో పాటు అనేకమంది  సంస్కృతాన్ని నేర్చుకొని దానిలో నిష్ణాతులై కావ్యాలను రచించిన వారు కూడా ఉన్నారు  వారి పేర్లు కూడా మనకు తెలియదు  అయినా వారంటే చిన్న చూపే.
గార్గి తో పాటు  గోధ గోష, పారా, వేష మాతృ కర్షక బహిజాయా విరోమక నామ అగస్త్య రూపాదిశా శస్యతి  మొదలగువారు  కొంతమంది మాత్రమే మనకు తెలుసు  కెలుని భార్య నిష్ఫల  యుద్ధానిపుణురాలు  అరివీరులను  చూసిన కొలది వీర విహారం చేసే  సబల  పులకేసి కోడలు విగ్నిక  సంస్కృతంలో మొదటి కవయత్రి ఆమె  అంతకుముందు పురుషులు తప్ప స్త్రీలు వ్రాయలేరు అన్న ప్రజల భ్రమను తొలగించి  తాను కలం చేతబట్టి పురుషుల కన్నా స్త్రీలు బాగా వ్రాయగలరు అన్న విషయాన్ని  రుజువు చేసిన మరో సబల  వంట ఇంటి పనులకు తప్ప ఎందుకు పనికిరాదు స్త్రీ అని  ఎద్దేవా చేసే పురుషులకు  చెంపపెట్టుగా  వారు నేర్వని అని విద్య గాని  ఘనకార్యాలు కానీ లేవు. దుర్గాబాయి దేశ్ ముఖ్ లాంటి స్త్రీలు సమాజ సేవ కొరకే తమ జీవితాలను అంకితం చేసి అనేకమంది స్త్రీలను ఉద్యమంలోకి తీసుకువచ్చి వారందరినీ  ఉన్నతులని చేయడానికి విద్యావంతులను చేసిన ఘన కీర్తి పన్నుల స్త్రీ  కందుకూరి వీరేశలింగం గారు ఇన్ని కళాకారులును చేయడానికి ప్రధాన కారణం ఆమె భార్య రాజ్యలక్ష్మి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు  తాళ్లపాక అన్నమయ్య రచించిన కీర్తనలు మనకు తెలుసు తప్ప ఆయన భార్య తిమ్మక్క గొప్ప రచయిత్రి అన్న విషయం మనకు తెలియదు  ఈ భూమిపైనే కాక ఆకాశంలో కూడా అంతరిక్షం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నవారిలో స్త్రీలు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నారు అన్న విషయం మర్చిపోతే మానవ మనుగడకు అర్థమే లేకుండా పోతుంది అన్న విషయాన్ని గమనించాలి.
(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)



కామెంట్‌లు