చదువు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు-.6302811961.
 ఎన్నిసార్లు చదివినా చెప్పలేని పిల్లలు కొంతమంది ఉంటారు  వాటిని శిక్షించడానికి  ఉపాధ్యాయుడు ఎప్పుడూ ఒక పేను బత్తాన్ని తన చేతిలో పట్టుకొని సిద్ధంగా ఉంటాడు  అది చూడగానే చాలా భయపడిపోతాడు విద్యార్థి  తరువాత గోడ కూర్చి లేస్తారు  గోడ దగ్గరగా నిలబెట్టి  మోకాళ్ళపై  ఉండి గోడకు అనుకొని పాఠం చదవాలి  5 10 నిమిషాలు  అలా చేస్తే కాళ్లు చాలా   ఇబ్బంది పడతాయి  కనుక అలాంటి పొరపాట్లు చేయకుండా  ఏ క్షణాన ఏ  పాఠం చదవాలోఅది  చూడకుండా గడగడా చెప్పేట్లుగా అలవాటు చేసుకుని  ముందు అమ్మకు దానిని వినిపించి  తనకు తప్పులు లేకుండా వచ్చాయని నిర్ధారణ చేసుకున్న తర్వాత కానీ బడికి వెళ్ళడు  కానీ ఈరోజు పద్ధతి మారిపోయింది  కాలేజీలో లాగానే పిల్లలకు కూడా  పాఠాలు చెప్పడంతో సరిపోతుంది  వారు అర్థం చేసుకుంటున్నారా లేదా అని కూడా ఆలోచించరు ఉపాధ్యాయుడు. ఈ రోజు పలకా బలపం అనే శబ్దాలు వాడితే అవేవో చాలా కొత్తగా అనిపిస్తే పిల్లలకు  కారణం చిన్నతనంలో వారు వాడవలసిన ఆ పరికరాలను వాడలేదు కనుక  కొంచెం పిల్లలు పెరిగి పెద్దవారై వారి పాఠాలు వారు చదువుకోగలిగిన స్థితికి వచ్చినప్పుడు అమ్మ చేయవలసిన మొదటి పని  నీతి కథలు కలిగిన పుస్తకాలను వారికి  అందించి  అది చదివి ఆ కథలో ఉన్న విషయాన్ని తనకు చెప్పే పద్ధతిలో  చివరిగా ఆ కథ వల్ల నీతి ఏమిటో తెలిసేటట్లుగా  ఆ కుర్రవాడిని తయారు చేస్తే  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాగా  లండన్ లో ఉన్న అన్ని పుస్తకాలు  చదివేసినట్టుగా  తనకు దరిదాపుల్లో ఉన్న గ్రంథాలయానికి వెళ్లి  తాను చదివిన పుస్తకాలు కాకుండా కొత్త పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని వెతికి తనకు కనిపించకపోతే  నిర్వాహకుణ్ణి అడిగి తీసుకొని  చదవవలసిన అవసరం ఈరోజు యువతలో ఎక్కువగా కనిపిస్తుంది
కామెంట్‌లు