సార్థకత- బి. నిఖిల్ చరణ్ 9వ తరగతి - జడ్.పి.హెచ్.ఎస్ ఇబ్రహీంనగర్,-సెల్ :6300203158
 అనగనగా ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడి పేరు రామ. రాము తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రికి కాళ్లు చేతులు పనిచేయవు. రోజు రాము తెల్లవారుజామునే లేచి ఇంటి పని  చేసి బడికి వెళ్ళేది. రోజు రాము బడికి లేటుగా వెళ్ళేది. అతని మాస్టారు రోజు నువ్వు ఎందుకు లేటుగా వస్తున్నావు అని రెండు చివ్వాట్లు పెడతాడు. దాని తర్వాత రోజు రాము మళ్లీ లేటుగా వస్తాడు. మాస్టారు కొట్టి లోపలికి రమ్మంటాడు. రాము క్లాస్ రూమ్ లో పడుకుంటాడు. అతని పక్కనున్న పిల్లవాడు సార్ రాము పడుకున్నాడు అని చెప్పుతాడు. దాంతో సార్ వచ్చి మళ్లీ రామును  ఎందుకు నిద్ర వస్తుంది? రాత్రి పడుకోకుండా ఏం చేస్తావు అని అడుగుతాడు. 
జవాబు చెప్పక పోవడం వలన
రాము సార్ చేతుల  చివాట్లు తింటాడు.
 ఒకరోజు రాము వాళ్ళ సార్ కారణం కనుక్కుందామనీ రాము వాళ్ళ ఇంటి వైపు వస్తాడు. అనారోగ్యంతో తన తండ్రిని చూసుకుంటున్నా రాముని చూస్తాడు. దాని తరువాత రోజు రాము మళ్లీ బడికి లేటుగా వస్తాడు. ఈసారి సార్ రామును చూసి నువ్వు రోజు మీ నాన్నని చూసుకుంటూ బడికి లేటుగా వస్తున్నావు కదా అని రాముతో అంటాడు.  "అవును సార్ మా నాన్నకు చేతులు కాళ్లు పనిచేయవు. అందుకే నేను ఇంటి పనిచేసి రోజు బడికి లేటుగా వస్తున్నాను సార్" అని అంటాడు."  
"పర్లేదు నాన్నా. నువ్వు మీ నాన్నని చూసుకొని ఇంటి పని చేసి బడికి రా."  అని అంటాడు సార్.
"సరే సార్" అని అంటాడు. 
రాము" నిన్ను ఇంకొకసారి తిట్టను. కొట్టను. తెలియకుండానే నీపై చేయి చేసుకున్నందుకు బాధ పడుతున్నా. మీ నాన్నకి సేవ చేస్తున్నావు. నీవు గొప్ప వాడివి. నీవే కాదు తల్లిదండ్రులకు సేవ చేసేటోల్లు ఎవరైనా గొప్పోల్లు.
 నీ  బాధని అర్థం చేసుకోలేక నిన్ను రోజు కొడుతున్నాను.
 "సార్! మీరు పెద్దవారు పైగా మీరు మాకు చదువు చెప్పే మాస్టారు. తండ్రి తర్వాత తండ్రి. మీరు బుద్ధి చెప్పేవారు సార్. మీరు బాధపడొద్దు సార్.
జరిగిన దాంట్లో తప్పంతా నాదే సార్.
నేనెందుకు నా సమస్య చెప్పలేదు అంటే తెలివైన విద్యార్థి, అంకిత భావం కలిగిన వారు ఏ కారణాలు చెప్పొద్దని మీరే చెప్పారు సార్. అందుకే నా కారణాలు చెప్పలేదు సార్. నన్ను మన్నించగలరు.
పిల్లలు అందరూ చప్పట్లు కొట్టండి అనగానే అభినందన గా చప్పట్లు కొడుతున్నారు. రాములాగా మీరు కూడా మీ తల్లిదండ్రులకు సేవ చేయండి. అదే జన్మ సార్ధకత అని సార్ చెప్పగానే విద్యార్థుల మనసు కలిగినట్లు అయింది.
కామెంట్‌లు