పరమాత్మా!
నీవెక్కడున్నావో ?
రమా వల్లభునితోనో
వాణి మనోహరునితోనో
సురగణంబుతోనో
అసురనికరమ్ముతోనో
ఎక్కడున్నావో యేమో !
వెతల చెప్పుకుందామని
వెతుకుతున్నా
వేదన నివేదిద్దామని
తపిస్తున్నా- జపిస్తున్నా
కలవరిస్తున్నా - పలుకనైతివి
దొరకవైతివి
ఎవరికి చెప్పుదు నా గోడు
వినరావైతివి - ఏనాడు
పరమేశా నీవెక్కడున్నావో
మోహినీ మత్తులోనో
ఊహల గమ్మత్తులోనో
అనురాగపు సరిత్తులో
నో
ఆహ్లాద మరుత్తులోనో
అమ్మవారి సన్నిధిలోనో
అనంతుని పెన్నిధి కడనో
మనంలోనో, కైలాసంలోనో
ఎక్కడని వెదుకుతు చెప్పు!
ఇకనైనా పెదాలు విప్పు!
సురేశా నీవెక్కడున్నావో?
నీవెక్కడున్నా -
నాకు కనరాకున్నా......
కటిక చీకటిలోవున్నా
కాంతిపుంజమై వున్నా
మనసులో ధ్యానిస్తున్నా
మాయగా భావిస్తున్నా
శుభమస్తు జగదీశ్వరా!
నమోనమః
శివం నమః శివాయ నమః
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి