కాత్యాయనీ దండకం మమత ఐల-కరీంనగర్-9247593432
 ఆధ్యాత్మిక 
========
శ్రీ దేవి ,భూదేవి ,సర్వేశ్వరీ మాత సాకారమున్ దాల్చగా జ్ఞాన సామ్రాజ్య మైనట్టి నీదివ్య తేజమ్ములో మున్గ గీచిన్ని దీపంబు నీప్రజ్ఞలో చేరగన్ నాదెంత భాగ్యంబు నీదర్శనోత్సహ మాధుర్య మందున్ తరించంగ నా పాప దోషంబులన్ దుంచగా జ్ఞాన నేత్రంబు లో జేరి మార్గంబు కైజూడ నన్ బ్రోవ వేంచేసి మోక్షాన్ని గల్గించగన్ నీ కృపన్ పొంద గీనాటికిన్ జన్మ ప్రాకారమున్ దాల్చగాకార రూపాన్ని మైమర్చి సాకార ద్వారాన్ని చేకొంటినే నీదయా దీక్షలో నున్న యెన్నెన్ని దీపాలు నీరాకకై వేచెనోతల్లి!
కాత్యాయనీ మాత నీదీవెనల్ పొంది నీనీడనే దల్చుచారోగ్య భాగ్యంబులన్ పొంద గాయుష్షు తోపాటు శ్రీ లక్ష్మి నారాయణున్ జేర ముక్తిన్ ప్రసాదించ భూలోక వాసుల్
స్మరించంగ నీనామ సంకీర్తనల్ జేయగన్ వారి విజ్ఞానమేనీవు నీరూపులో కాంతి నీ చూపులో జ్యోతి నీ స్పర్శనే తీపిగన్ దర్శనంబై  సధానిన్ను సేవించ గోరన్ వికారాలనే త్రుంచగా కాళివై సాక్షాత్కరించన్ జగన్నాయకీ... మాకు శాంతిన్ ప్రసాదించి మమ్మేలుమా దేవి
యోగీశ్వరీ కాల కాళేశ్వరీ జ్ఞాన జ్ఞనేశ్వరీ సర్వ లోకేశ్వరీ ఓ కృపా సాగరీ....పాహి మాంపాహి సర్వేశ్వరీ! దేవి
కామెంట్‌లు