జీవితం -కవిత్వం.;- డా.పివిఎల్ సుబ్బారావు.- 9441058797.
 ప్రపంచ కవితాదినోత్సవం.
           (మార్చి 21)
శుభాకాంక్షలు అందిస్తూ--
=========================== 
ప్రపంచం ఒక పద్మవ్యూహం, మనిషి విజయుడై ఛేదించాలి!
 కవిత్వం ఒక తీరని దాహం , భగీరథుడై గంగసాధించాలి!
 ఆరంభం అంతం,
            ఉన్నది జీవితం! 
మన జీవితం,
     అత్యంత పరిమితం!
 
అయినా జీవితం ,
  మనకి దేవుడిచ్చిన వరం !
జీవించి నన్నాళ్లు ,
   ఉత్సాహం ఊత అవసరం! 
కవిత్వానికి ఆదే, 
          మరి అంతం లేదు !
ఆదికావ్యం నుండి ,
మరెన్నో ఆధునిక కావ్యాలు !
కవి మరణిస్తాడు ,
           కవిత్వం జీవిస్తుంది!
 కవి ఋషి ,.
 అక్షర తపస్సు చేస్తాడు!
 ప్రతి ప్రభాతంలో, 
      భాస్కరుడై భాసిస్తాడు!
కామెంట్‌లు