ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఏ ప్రజల కోసమైతే మనం ఇన్ని పనులు చేస్తున్నామో  అలా ప్రజలు  బాధలు పడుతూ ఉంటే అది విధి అనుకుంటూ మనం దిక్కులు చూస్తూ ఊరుకున్నట్లైతే ప్రజలలో మనకున్న గౌరవం మర్యాదల  లు అన్నీ మంట కలిసి పోతాయి  మనలో ప్రాణమైన మన సోదరులు  ఆ బాధతో మనకు శాపాలు ఇవ్వకుండా ఉంటారా  ఎంతకాలం ఇలా చేస్తాము  అంతకాలము ప్రజలను బాధిస్తూనే ఉంటారు వాళ్ళు విప్లవాక్కులను సేకలతో విసిగిపోయి చేతులెత్తి ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు  ఆత్మహత్య కైనా సిద్ధం  అని  అమ్మ కొడుకు ప్రతిజ్ఞ చేసి  దురంత పాలనను అంతం చేయడానికి పూనుకున్నామని ఈ యుద్ధంలోకి దిగామని  ఆ రోజున ఏమాత్రం భయం లేకుండా  విజయాన్ని పొందాం  ఇంతకాలం ప్రస్తుతం మనం పంతం మాని ఈ ప్రజల బాధలను తీర్చడం మన బాధ్యత కాదా  మనం లేకపోయినట్లయితే మన్యాన్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్లిపోతారు కదా  మన్యం యొక్క పీడ వదిలిపోతుంది కానీ  పనులకు ఇంకా కాలం వచ్చేదేనని తెలిసి  తెల్ల దొరలు ఆనందించవచ్చు  కనుక ఈ విజయంతో మన పని అయినది వీర చరిత్ర శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది  భవిష్యత్తులో నలుగురు  కలిసి ఉన్నప్పుడు మన ప్రస్తావన రాకపోదు నన్ను బంధించడం చేతకాక నా ప్రజలను కష్టపెడుతున్నారు  ఈ క్రూర మనస్కులు నేను పోయినట్లయితే నా వారి బాధ తొలగిపోతుందా కనుక ఆత్మార్పణము చేయను  ఇక్కడకు తపస్సు చేయడానికి వచ్చాను. జాతి శ్రేయస్సు కొరకు యుద్ధంలో దిగాను  మీ సహచర్యం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మీ అందరిని మెచ్చుకుంటున్నాను  ఈ పని కోసమే నా ప్రాణాన్ని నేను  నా ప్రజల కోసం ఆహుతి చేసుకుంటాను  నా సీమ ప్రజలందరూ కష్టాల నుంచి తేరుకుంటారు  అమ్మ నాకు జన్మనిచ్చింది ఈ జాతి నన్ను పెంచింది  వీరికి నేను ఇచ్చే నివాళి  ఇదియే  అని పలికిన రాజు గారి మాటలు విని ఆహాకారాలతో కన్నీరు వరదలై కాలువగట్టగా  అన్నా అన్నా అంటూ  కంట సీమలు గగ్గతంతో నిండగా  రాజును చుట్టుముట్టారు  అన్నా నిన్ను కోల్పోతే మన్యానికి ఇక దిక్కులేదు  మన్యానికి అన్యాయం చేయు కన్నా  నీవు ఉన్నావన్న ధైర్యంతోనే మేమందరం జీవిస్తున్నాం  నీవు ఆత్మార్పణ చేసుకుంటే మేమంతా ఏమైపోవాలి అన్నారు.

కామెంట్‌లు