ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 సూర్య భగవానుడు తన సప్తశ్రములతో వస్తున్న  రధములు (ఏడు గుర్రముల  వలన ఏర్పడిన పదా ధూళి) అరుణమై  ఉదయాద్రి పరిచే వేళ  పొలాలలో నృత్యం చేస్తూ తిరుగుతున్న హంసల  సంచారములు  బయల సాగు వేళ కిలకిలరవములతో ఇతరులను పలకరించుకుంటూ గూళ్లను విడిచి వస్తున్న పక్షుల శబ్దాలు వస్తున్న సమయంలో ప్రళయ భయం చేత బయటపడిన నాగులు ప్రాణబీతిని మరచి పెనుగు వేళ  లేత పచ్చిక తినడం కోసం లేడ్ల గుంపు చెంగుచెంగున బీళ్ళకు చేరే వేళ  యువకుడు ఒకడు సెలయేటికట్టపై ఉన్నాడు  అతని వయస్సు ఇరువది 17 ఏండ్లు ఉండవచ్చు. పద్మాసనం వేసుకునే కూర్చున్నాడు  తూర్పుదిక్కుగా ముఖం ఉంది.
పద్మాసనంలో కూర్చున్న అతను తూర్పుదిక్కుగా ముఖాన్ని పెట్టి  ఆ సమయంలో వస్తున్న  అరుణ రేఖలు సింధూర లాగా కనిపిస్తూ ఉన్నాయి  ఆ కిరణాలు  లేత  లేత పవనుని తాకి  మురిపముగా ఉన్న అతని  మోములో ముద్దాడుతున్నాయా అన్నట్టు కనిపిస్తోంది  అర్థనిమీలితమైన కన్నులతో చూసినట్లయితే  అతని చాలా గాఢత తీరు మనకు తెలుస్తుంది  చేతిలో పట్టుకున్న జపమాల సంఖ్య కదలి  విశ్వ   శంకము నందు వచ్చే శబ్ధ విధానాన్ని తెలియచేస్తుంది  చూడడానికి యోగ విద్యను నేర్చుకున్న యువకుడిలా ఉన్నాడు  లేకపోయినట్లయితే  ఏమిటి  బ్రహ్మపుత్రుడు అన్ని పనులు చేసి సంధ్య వార్చుచున్న సన్యాసి ఏమో అనిపించే విధంగా కనిపిస్తున్నాడు.
అతని వద్దకు  10 12 సంవత్సరాల వయసు గలిగిన బాలుడు ఒకడు చేతిలో చెంబు పట్టుకుని వచ్చాడు  ముందుకు వచ్చి  తాను మ్రొక్కుతూ మంప మొలసపు పంపే మంచి పాడు అని చెప్పాడు  ఆ మాటలు విన్న ఆ యువకుడు జపాన్ని కనులు తెరచి బాలుడిని చూసి పాలు తీసుకొని తాగి  అతనితో చెప్తున్నాడు  నేను ఒక పని చెప్తాను అది చేయవయ్యా  కొయ్యూరు పోలీసుల వారికి చెప్పండి  ఈ ఏటి ఒడ్డున నేను ఉన్నాను అని  వారు వచ్చినట్లయితే తాను వశం అవుతాడు అని రామరాజు చెప్పాడని చెప్పండి బిడ్డా  అమాయకపు బాలుడైన  అతను అలాగే చేస్తాడు పరు వ్యక్తి పోలీసు వారి వద్దకు వెళ్లి అతడు చెప్పిన మాట  ఆలకించిన పోలీసులు  కంగారుపడి వెంటనే కదిలి వచ్చారు.

కామెంట్‌లు