ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అధికారులు అందరూ ఏకమై అడిగారు  జరిగిన విషయం మొత్తం జమేదారు చెప్పాడు  రాజు గారు కబురు చేసి అరెస్టు చేయమని కోరితే మేము వెళ్లి అతనిని అరెస్టు చేసి తీసుకు వచ్చాం  రాగానే అతనిని   కాల్చి చంపారు  పట్టుబడిన వానిని కట్టి చంపడం ఏమిటి  చట్ట విచారణ చేయవలసిన అవసరమే లేదా  నీవు ఏం సంజాయిషీ ఇస్తావో ఇవ్వు  అని ఆ నీచుని నిలదీశారు  నేనీక్కడకు అస్సాం గవర్నర్ ఆజ్ఞతో వచ్చాను నన్ను అడిగే హక్కు అతనికి ఒక్కడికే ఉంది  మీలో ఎవరు కానీ మీ గవర్నర్ కానీ  నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు అని చెప్పాడు  ఆ తర్వాత రోజు ఉదయం  మంది మార్బలంతో కృష్ణదేవపేటకు వచ్చి పదిమందికి  చూపి పంచనామా చేసి  ఇతనే నిజమైన రామరాజు అని  తీర్పు చేశారు.
ఆ మృతదేహాన్ని చూడడానికి  ఆబాల గోపాలం తండోపతండాలుగా తరలివచ్చారు  దేవుని చూడడానికి వచ్చిన భక్తుల వలే  కనిపిస్తున్నది ఆ దృశ్యం  వారి రోదన ధ్వనులతో ఆకాశం ధ్వనించింది  తల్లులు పిల్లలు తడబడే వృత్తులు మగవారు యువకులు  మన్య ప్రజలు  నేలపై పడి ఇద్దరు  మా తండ్రి పోయాడు అని   ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు  శవ దహన కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఒక్కడే రోదిస్తూ ఉన్నారు  ఆ అగ్ని కీళ్లలలో రాజు దేహం అంతరించిపోయింది  అమరలోకానికి వెళ్లడానికి రాజు ఆత్మ పయనించింది  అక్కడ ఉన్న దుష్కృత్యాలను  ఆపాలన్న  ఆలోచన రాజు గారికి వచ్చి ఉండవచ్చు  అందుకే త్వరగా పయనం అయింది ఆత్మ. ఆంధ్రప్రదేశ మంతా అట్టుడికి పోయినట్లు ఉడికిపోయింది  అల్లూరి మరణించాడు అన్న వార్త దేశం నలుమూలలా తెలిసిపోయింది  అది దవానాలంలాగా అందరి హృదయాలను కాల్చివేస్తుంది  కన్న తల్లికి కూడా కబురు చేయకుండా వారు దహనం చేయడం  విశేషం  ఆ తర్వాత రామకృష్ణం రాజుగారు తల్లికి కబురంపితే అప్పుడు ఆమెకు తెలిసింది  ఆమెకు తెలిసి వస్తే గుండె మండిపోయింది. నా బిడ్డ చితిలో నేను కూడా దహనం అయిపోతాను  నేను ఇలా బ్రతికి ఉండడంతో ఏమిటి ఫలం అని తల్లి బంధువులు తుని స్టేషన్కు చేరి దహనం చేశారు అని వార్త తెలిసిన తరువాత  చివరి చూపుకైనా లోచుకోలేకపోయామే అని తల్లి గుండె తల్లడిల్లిపోయింది  చుట్టూ చేరిన వారు చుట్టాలు పక్కాలు ఎరుగెత్తి ఏడ్చారు ఆ తల్లిని చూసి.
కామెంట్‌లు