ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 తుని లో ఉన్న స్నేహితులు మొత్తం తల్లి దగ్గరకు వచ్చి అమ్మా ఎంత ఘోరం జరిగిపోయింది అంటూ ఏడవడం మొదలుపెట్టారు  ఆ దుఃఖిస్తున్న వారిని అందరినీ శోకించవలదు అని చెప్పింది ఆ మాతృమూర్తి  తమ్ముడు నిన్ను సేవిస్తూ ఉంటాడు వాడిని నీ దగ్గరే ఉంచుకోమని వాడిని నా దగ్గర వదిలి వెళ్ళాడు బంగారు తండ్రి రాజు  నా నుంచి సెలవు తీసుకుని బయలుదేరినప్పుడే భారతమాతకు  తాను తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అని ధృఢ నిశ్చయంతో బయలుదేరి వచ్చాడు  దేశమాతకు నా కుమారుడు దత్తుడయ్యాడు  ఆమె దుఃఖాన్ని వేరు పరుస్తుంది నేనెందుకు దుఃఖించాలి అని ఎంతో బాధ పడిపోయింది ఆమాతృమూర్తి  ఆమెను చూసి అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరూ  కన్నీరు పెట్టిన వారే.
మనవాడు వీరుడు వీరమరడాన్ని పొందాడు మనం సోకించడానికి తగిన వారం  కాము అంటూ తిరిగి ఇంటికి వెళ్లి శాస్త్రీయంగా 10నాళ్ళ శాస్త్ర కర్మలను ఆ వీరమాత చేయడం  సంప్రదాయబద్ధంగా  అన్ని కార్యాలు నెరవేర్చుకున్నది ఆ బంగారు తల్లి  నిజమైన వీరుని నిజ దేశ భక్తుని కోల్పోయామని ఆంధ్రకే సరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు చలించిపోయాడు  ఆయుధాల పోరు అనర్ధాన్ని తెస్తాయి అని ఆ రోజే నేను చెప్పాను అని గాంధీ ఒక్కసారి స్మరించుకున్నారు  అల్లూరి త్యాగం అసమానమని నెహ్రూ  నా సొంత సోదరుని కోల్పోయాను అని బోసు  పత్రికలన్నీ కూడా పలు రకాలుగా వార్తలను ప్రశంసిస్తూ   రాసుకున్నాయి  నాయకులు పోయెను అన్న వార్త నమ్మలేక  అందరూ ఒక చోట చేరి ఆందోళన చెంది అన్న చెప్పిన మాటను అమలు చేయడమే  మన తక్షణ కర్తవ్యం అని  నిర్ణయించుకున్నారు. సీతారాముల వెతుక్కుంటూ వచ్చిన గంటం దొరను వెతుకుతూ వైరి సైనికులు  ఇంటికి వచ్చి గంటం దొర ఇద్దరు భార్యలను  అడిగి వారిలో పెద్ద భార్య కూతురిని ముందుగా ఖైదు చేశారు  గంటన్నర జాడ చెప్పమంటూ బాధించారు  బంధుజనులను కూడా రప్పించి వారిని కూడా  చిత్రహింసల పాలు చేశారు గంటం చిన్న భార్య తప్పించుకొని పారిపోయింది వనాలలో  తిరుగుతూ ఉంది  తన నాయకుడు లేక ఇంకా ఈ బ్రతుకు దేనికి అంటూ  రోదిస్తూ పిచ్చిదానివలే తిరుగుతోంది  ఎనిమిది మందిని తన వెంట పెట్టుకుని  ఏటి పొంతన నిలిచి పోరాటానికి రమ్మని వీర కేకలు వేస్తూ వచ్చారు  100 మంది సైనికులు  చుట్టు ముట్టినవారు చెట్టు చాటున దాగి కాలుస్తూ ఉండగా తానును కాల్చసాగే ఇరువైపులను కాల్పులు  జరుగుతూ ఉండగా వీరు లిద్దరూ నేల కొరిగారు.
కామెంట్‌లు