ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అక్కడ రామరాజు గారి దగ్గర నేర్చుకుంటున్న సమయంలో  వారితో బాగా సాన్నిహిత్యం పెరిగింది  ఒకరోజు  అయ్యా రామరాజు గారు నాకు చిన్న సందేహం ఉంది తీర్చగలరా  అని అడిగినప్పుడు  సందేహాలను రాచుకోకూడదు నిర్భయంగా అడగండి అని భరోసా ఇవ్వగానే  మిమ్మల్ని పరాయి దేశం వారు చెట్టుకు కట్టి  తుపాకులతో కాల్చారు ఉరి తీశారు అని పత్రికలలో వచ్చింది ప్రభుత్వం వారు కూడా ప్రకటించారు కానీ నేడు నా ఎదురుగా మీ మూర్తిని చూస్తున్నాను  ఏది కలో ఏది నిజమో  అర్థం చేసుకోలేని స్థితిలో నేను ఉన్నాను  నాకు ఈ సందేహాన్ని తీర్చండి  అని అడిగినప్పుడు  రామరాజు గారు ఎంతో సంతోషించి నా జీవితంలో జరిగిన పాత విషయాలను జ్ఞాపకం చేశారు  ఇలా వచ్చి కూర్చోమని తన ప్రక్కన కూర్చోబెట్టుకొని జరిగిన విషయాన్ని  రామ భద్ర రాజు గారితో చెప్పారు. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి  కుల మత వర్గ విచక్షణ లేకుండా  జీవితాన్ని దేశం కోసమే అంకితం చేసి పరాయి  రాక్షసులను తరిమికొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని  మన్య ప్రాంతానికి వెళ్లి  అక్కడ నా ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తించే వ్యక్తులను ఎన్నుకున్నాను  వారందరికీ నా  ఆశయాలను అర్థం అయ్యేలా చెప్పి  నాకు తెలిసిన విద్యలనన్నిటినీ నేర్పాను  అందరిని ఒక త్రాటి మీద నడిపించడానికి ప్రయత్నం చేశాను  స్త్రీలలో  జ్ఞానాన్ని పెంచడం కోసం ప్రతి ఒక్కరిని విద్యార్థికులను చేయాలన్న అభిప్రాయంతో  వారందరికీ రాత్రి పాఠశాలలు నెలకొల్పి ప్రతి ఒక్కరిని చదువుకునేలా   పురి గొల్పాను  వారిలో కొంతమంది సాము గరిడీలు కూడా నేర్చుకున్నారు  యుద్ధానికి సన్నద్ధులైన వారు కూడా స్త్రీలలో కొంతమంది ఉన్నారు  నా పోలికలు ఉన్న ఇద్దరు  నాతో పాటు కలిసి పని చేశారు. దానిని అదృష్టంగా భావించి  నాకు కావలసిన పద్ధతిలో దానిని తీర్చిదిచ్చాను  వారిద్దరికీ కూడా నా పేరు నే పెట్టాను  నేను చేసే సీమటపాకాయ్  లాంటివి  బ్రిటిష్ వారి గుండెల్లో  భయాన్ని నెలకొల్పడం కోసం ముగ్గురం మూడు చోట్ల  ఓకే  ప్రయత్నం చేసేవాళ్లం  దానితో నేను చాలా మంత్రాలు తెలిసిన వాడిని  ఎక్కడకు పడితే అక్కడకు వెళ్ళగలిగిన వాడిని ఒక్కడినే అనేక చోట్ల కనిపించగలిగిన వాడిని అన్న అభిప్రాయం వారిలో కలిగింది  చివరి రోజున నా మిత్రుడు  అన్నా  చివరి రోజులు వచ్చాయి  నిన్ను బంధించడానికి వారు అనేక రకాల ఏర్పాటు చేసుకుంటున్నారు  వారి బలగం ఎక్కువగా ఉంది  నేను మీ వేషంలో వెళ్లి  వారికి ముందు తెలియజేసి  నేను ఫలానా చోట చెరువులో స్నానం చేస్తున్నాను అని కబురు చేస్తాను  ఈ విషయంలో మీరు నాకు అడ్డు చెప్పవద్దు అని నా అనుమతి తీసుకుని  వెళ్లాడు.

కామెంట్‌లు