ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చేరిన తర్వాత  గొప్ప గొప్ప నటీనటులతో  అనేక నాటకాలలో పాల్గొన్నాను  విజయవాడ నుంచి కడప వెళ్లి అక్కడ  కొంతమంది కొత్త వారిని తయారు చేసి వచ్చాను  తర్వాత విశాఖపట్నం వెళ్లి అక్కడ  అనేక నాటకాలకు దర్శకత్వ బాధ్యత వహిస్తూ  ప్రధాన పాత్ర నిర్వహిస్తూ ఉండేవాడిని  ఆ తరువాత ఢిల్లీ వెళ్లి ఈ ఎస్ డి ఎక్స్టర్నల్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఇతర దేశాలలో ఉన్న తెలుగువారి కోసం  ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు అన్న శీర్షికతో  మొదట నేను ఢిల్లీ కేంద్రంలో ప్రారంభించాను  ఈ విషయాలన్నీ సమగ్రంగా తెలియచేయకూడదా అంటూ చాలామంది చదువరులు  ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు  రాజశ్రీ గారైతే  తప్పకుండా రాయమని  పట్టుబట్టారు. అందుకోసం ఈ ప్రయత్నం  భారతదేశంలో ఇన్ని కేంద్రాలు ఉండగా విజయవాడ కేంద్రానికి ఎందుకు ప్రత్యేకత  ఆ కేంద్రంపై అంత ప్రేమ పెంచుకోవలసిన అవసరం  ఎలా వచ్చింది అని నా ఆత్మీయ మిత్రులు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు  చంద్రశేఖరాచార్యుల వారి దగ్గర నుంచి  భారతదేశ రాష్ట్రపతి వరకు ప్రతివారు మా ఆకాశవాణిని సందర్శించిన వారే  తమ సందేశాలను అందించిన వారే మా కేంద్రంలో ఉన్న మేధావి వర్గం  మిగిలిన వాటిలో లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదు  ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క నిష్ణాతుడైన  యోగ్యులను ఎన్నిక చేసినది మా ఆకాశవాణి విజయవాడ కేంద్రం  ఆ రోజులలో ఎంతో దీక్షతో క్రమశిక్షణతో  అంకితభావంతో పనిచేసిన వారే ప్రతి ఒక్కరు  నాలుగో తరగతి  ఉద్యోగం అంటూ ప్రతి ఒక్కరూ తన కార్యక్రమము అంటూ  అంకిత భావంతో చేసిన వారే. అందుకే  ఢిల్లీ కేంద్రం వారు అన్ని కేంద్రాల నుంచి వాడు చేసిన కార్యక్రమాలలో ఉత్తమమైన వాటిని ఎన్నుకొని  వాటిలో ఉత్తమమైన వాటికి మూడు బహుమతులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తే  దేశంలో ఎన్నో కేంద్రాలు ఉండగా విజయవాడ కేంద్రానికి  మూడు బహుమతులు రావడం ప్రథమ విజయం  ఏ కేంద్రంలోనూ ఎవరూ చేయని పని  మా కేంద్రం చేసిందని గర్వంగా చెప్పుకునే పని  మారామం ఎస్పి శ్రీరామ్మూర్తి చేసిన కార్యక్రమాల సమీక్షతో  నా సోదరుడు  జయ ప్రకాష్  అద్భుతమైన విశ్లేషణతో  అందమైన భాషలో  పీహెచ్డీ చేయడం  ఎంతో గొప్ప ఘనకార్యంగా నేను భావిస్తూ ఉంటాను  మా కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలను  భాష  తెలియని కేంద్రాలు కూడా  రిలే చేయడం  మా కేంద్ర ఘనత  అందుకే  మా కేంద్రంపై అంత మమకారం.

కామెంట్‌లు