త్రిజట- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సర్వలోక మనోహరి సీతాదేవి యొక్క లోకోత్తర సౌందర్య దర్శనమే సుందరకాండ యొక్క ప్రధాన కథా వస్తువు ఈ సౌందర్యం యొక్క ప్రముఖ ద్రష్ట హనుమంతుడే ఆమె యొక్క అదే సౌందర్యాన్ని విపరీత దృష్టి కోణంతో చూసే ప్రతి ద్రష్ట రావణాసురుడు ఆ సౌందర్య విభూతే ఇద్దరి దృష్టిని ఆకర్షించినప్పటికీ ఇద్దరు సారించిన దృష్టి కోణాలలో మాత్రం విపరీతమైన భేద భావం నెలకొని ఉంది ఈ విరుద్ధ దృష్టి కోణాల భవితవ్యమును త్రి జట తన స్వప్నంలో ప్రతిబింబిస్తుంది ఆమె వర్ణనలో పలుమార్లు ద్రష్ట మరియు ద్రష్టా శబ్దాలు ఉపయోగించబడ్డాయి  త్రిజట  స్నేహితులు చాలా ఉత్కంఠతో ఆమెను అడుగుతున్నారు  చెపితే సరే సరి నువ్వు ఎలాంటి స్వప్నం చూసావు. దీనికి జవాబుగా త్రిజట తన స్వప్నకాండని విస్తారంగా తెలియజేస్తోంది మాటిమాటికి మయ ద్రష్ఠ మరియు ద్రష్టా నేను చూశాను నేను చూసి తిని స్త్రీ లింగం అనే శబ్దాన్ని ప్రయోగిస్తుంది  ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రాముడు రావణుని కొరకు రెండే రెండు సార్లు ఈ ధాతువు ఉపయోగించబడింది  కుంభకర్ణుడు విభేషునుని కొరకు ఒకసారి ఈ శబ్దం ప్రయోగించబడింది దానివల్ల అర్థమయ్యేది ఏమిటంటే త్రి జట యొక్క ఈ దృష్టి దశ దిశల వ్యాపించి సమగ్ర దర్శనాన్ని అందించింది అని తెలుసుకోవాలి  హనుమంతునితో స్నేహంతో మరియు రామునితో లంక వృత్తాంతం వివరిస్తూ ఉన్నప్పుడు కూడా మొదటిగా దృష్టా సీత (నేను సీతను చూశాను) అని చెప్తాడు.
హనుమంతుని అమృతవాక్కే సుందరకాండ యొక్క పరిపూర్ణ తత్వసారం  ఈ దృష్టి ప్రతిబింబమే మనం త్రిజట స్వప్నంలో చూస్తాము మరొక విషయం సీతారామ లక్ష్మణుల వర్ణన జరుగుతున్నప్పుడు కృష్ణ శబ్దాన్ని రావణుని పరివార వర్ణన జరుగుతున్నప్పుడు కృష్ణ శబ్దాన్ని మాటిమాటికి ప్రయోగించబడింది  రెండూ రెండు వ్యతిరేక దిశలకు ప్రతీకలు భగవద్గీతలో ఇదే చెప్పబడింది లోకంలో సదా రెండు విధాలు అయిన రెండు మార్గాలు నడుస్తున్నాయి ఒకటి శుక్ల లేక తెల్లనిది రెండవది కృష్ణ లేక నల్లనిది ఒకటి తెల్లగా ఉంటుంది రెండవది వంకరగా ఉంటుంది  ఒక మార్గంలో  పయనిస్తే గమ్యం చేరుకోవచ్చు కానీ తిరిగిరారు రెండో మార్గంలో వెళితే మధ్యలోనే సంచరించి తిరిగి వస్తారు.

కామెంట్‌లు