ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆయుధ శక్తితో  పోరాడుతూ ఉండడం పొరపాటు కాదా  మన దేశ వస్తువు అహింస  దానిని వాడడం మర్చిపోయి  దానిని ఆయుధంగా మార్చి  వాడవచ్చునన్న విషయాన్ని మర్చిపోతున్నాం  పొంగిపోయే పాలు పొయిలో పడిపోతాయి వ్యర్థం అవుతాయి  తగిన రక్షణ లేని సమయంలో  మంకుని విడిచిపెట్టు  ఎప్పుడో బాటలో నీవు నిన్ను కోల్పోయినట్లయితే  నీ తల్లి ఏం కావాలి  అని హితవు చెప్పిన బాపూజీ మాటలు విని  ఎంతో వినయంతో వీరుడు రామరాజు  మీరు చెప్పిన మాట నేను నీరజాలను  నా సత్తా ఏమిటో మీకు చెప్తున్నాను  వందల ఏళ్ల  దాస్యభావం  అలవాటైపోయింది  మనసులలో కర్మము అని సర్దుకుపోయే తత్వం పెరిగింది  నీవు చెప్పిన విధానాన్ని గుర్తు చేసుకొని  ఇక్కడకు చేరిన శత్రువులు వంచనాత్మలై  మన సంపదలను దోచుకుని పోతున్నారు. మనము వహించిన శాంత సహనాలను చూసి అది పిడికితనం అని ఆ మూర్ఖులు భావిస్తున్నారు  భారతీయుడు నిజమైన పౌరుషాన్ని తెలియజేయడం కోసం నేను  ఈ రంగాన్ని ఎన్నుకున్నాను  శాంతమును దరి చేర్చి  దాస్యము చేస్తూ ఉన్న భావన  సమ్మోహిత ప్రాంత చిత్తులై నిద్రనుతూగే జాతిని చూసి  ఆ మత్తు తొలగించబోవా  విప్లవ వీర శంఖాన్ని నినదించాను. ఆ తర్వాత మన్య సోదరులందరూ మత్తులో ఉన్నవారు  మేడుకొన్నారు  కల్లు త్రాగడం మానమని కదా మీ హితవు  అతి నేను అడవిలో మా సోదరులతో చేయించాను  పంచాయతులు పల్లె ప్రాణమని మీరు చెప్పిన మాటను నెరవేర్చాను  మన్య సీమలో  పంచాయితీలను నెల కొలిపాను  ప్రజలకు ప్రకృతిపై హక్కు ఉంది అన్న మీ బోధ ప్రజల ముందు ఉంచాను  మన జాతి వృత్తులు మరవకూడదు అని  మీరు చెప్పిన దానిని నిజం చేసి చూపించాను. కసరి బుస కొట్టి పేదల కడుపు కొట్టి బ్రతుకుతున్నటువంటి అధికారుల పని పట్టినాను  నేడు నిజంగా  మన్యం ధన్యమైనది  చెప్పి చేసేది నా చేత చావకలది  మంచి మాటలు చెప్పితే కౌరవులు మానేరా  ఏమైనా మారిందా  ధర్మవేత్తలు రావణాసురునికి ఎన్ని పద్ధతులలో చెప్పలేదు  వాడి దుష్ట చింతన నుంచి దూరమయ్యాడా పగ వాడిని ఏడుపర్యాయాలు క్షమించి వదిలిన  వాడు మారాడా  దుష్టబుద్ధి మహమ్మద్ ఘోరీ  శరణని వస్తే రా నీ చెంత చేర్చడం వలన జగవేయలేదా  ఈ తెల్ల దొరలు  అతికక్షమించి ఆపదలు తెచ్చుకున్న గత చరిత్ర నేటి కైనా తెలిసి జాతిని మేలు కొల్పడం కోసం  ఇది నా మార్గము మహాత్మా అని వెల్లదించాడు  మనిషి రూపంలో ఉన్నవాడికి మృగతత్వం ఉన్నట్లయితే  ధర్మ మార్గం వారి దగ్గరకు రాదు.


కామెంట్‌లు