శూర్పణఖ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 శ్రీరాముడు శూర్పణఖను చూశాడు శూర్పణఖ రాముని చూసింది ఇద్దరి చూపుల్లో ఎంత అంతరం  ఒకరు సుముకులు రెండవ వారు దుర్ముఖి ఒకరి నడుము సన్నం రెండవది లంబోదరి ఒకరి నేత్రాలు విశాలం నిర్మలం రెండవది విరుపాక్షి ఒకరి కేషములు నాజూకు రెండవ వారి కేశములు రంగురంగులు ఒకరి మాట మృదు మధురం రెండవ వారి మాట భయంకరం ఒకరి వయసులో   చిన్న రెండవ వారు  పెద్ద ముసలి ఒకరు చూడడానికి అందంగా ఉంటారు రెండవ వారు కామ వాసనతో  జుపక్త్సకరమైన పంకిలాకారంతో ఉన్నారు ఇలా ఇద్దరివి వ్యతిరేక విభిన్న ఆకార స్వభావాలను గురించి వాల్మీకి మహర్షి ఎంతగానో ఎలా వర్ణించారో చూద్దామా.
శూర్పణఖ నేరుగా శ్రీరామునితో మాట్లాడటం మొదలు పెడుతుంది కానీ ఇంత పరాక్రమశాలి  అయిన సుందర రాకుమారుడు జటావల్కలాలు ధరించి తన భార్యతో కలిసి ఈ అరణ్యం ఎందుకు చేస్తున్నాడని ఆలోచనకు రాలేదు శూర్పణఖ అడుగగా శ్రీరాముడు వృత్తాంతం అంతా సవివరంగా చెప్పాడు శ్రీరాముడు కూడా శూర్పణఖ విషయం గురించి అడిగాడు కానీ  తన తల్లిదండ్రులను గురించి గానీ భర్త గురించి గానీ ఏమీ చెప్పలేదు. కేవలం వీర శూరడైన తన సహోదరులను గురించి మాత్రమే చెప్పింది వారి ప్రతిభా వ్యుత్పత్తులను  తనను ప్రభావితం చేసినాయని చెప్పింది తన ప్రతిభ విశేషాలు చెప్పుకొచ్చే విధంలో చేసే ప్రయత్నంలో చివరకు సీతాదేవిని కూడా నిందించడానికి జంక లేదు. శూర్పణఖ సిగ్గు బిడియం వదిలి రామునితో సీత బలహీనురాలు అటువంటి స్త్రీ నీలాంటి పరాక్రమశాలితో సంగమించడానికి అర్హురాలు కాదు అని అంటుంది రావణుడు, కుంభకర్ణుడు  ఖరుడు దూషణుడు మొదలైన వీర శూర యోగ్య  అయిన ఈ శూర్పణఖను నీ జీవిత సహచరిగా చేసుకొని శేష జీవితాన్ని ఆనందమయంగా గడుపుకోమని కోరుతుంది శూర్పణఖ  ఇంకా మన ప్రణయ జీవనంలో అడ్డంకి అయిన సీత లక్ష్మణులను క్షణకాలంలో మ్రింగి మాయం చేయగలను అని కూడా చెబుతుంది.


కామెంట్‌లు