ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 మనకు ఏది సాధ్యం అవుతుందో దానికోసం తాపత్రయపడాలి ఏ పని చేయగలమో తెలుసుకొని ఆ పని చేయాలి  ఇవాళ పరిస్థితి ఏమిటి  నీ దగ్గర ఉన్నది విల్లు బాణం అవతల వారి దగ్గర ఉన్నది  ఆయుధాలు ఎంత దూరం నుంచైనా కాల్చి చంపే మారణాయుధాలు వారి దగ్గర ఉన్నాయి  దానిని ఎదుర్కోవడం కష్టం  నీలాంటి దేశభక్తులు ఈ దేశానికి ఎంతో అవసరం ప్రస్తుతం  నీలాంటి వాడిని ఒక్కడినే పోగొట్టుకుంటే  ఈ దేశం ఎంత నష్టపోతుందో మీకు అర్థం అవుతుందా  కురుక్షేత్ర యుద్ధంలో భారత యుద్ధాన  వారి ప్రాణాలు కోల్పోయారు వారిలో ఏ ఒక్కడైనా మిగిలి ఉన్నారా  ఇది అదునుకానీ సమయం కనుక యుద్ధంలో దిగినట్లయితే ప్రజలు మిగలరు. ముందు మనం చేయవలసిన పని ఒకటి ఉన్నది  శత్రువుల బలహీనత మనం తెలుసుకోగలిగినట్లయితే  దానిని ఆధారంగా దెబ్బ కొట్టవచ్చు  అలా అడుగు ముందుకు వేసిన వాడు   విజయాన్ని సాధిస్తాడు  ఆర్థిక విశ్వాసం వల్ల ఆపదలను కొని తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది  మనం ఏ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నాము  అది దానికి ఆటంకం అవుతుంది ఆలోచించు  ఎంత శక్తి ఉన్నా ఏక చక్ర పురంలో కుంతి పుత్రులు కాందిసీకులలాగా మెలగలేదా  ఎందరు ఉన్న వీరమల్లుడు  అల్లూరి ఒక్కడే  అతను లేకుంటే  వీర హారము మణి లేని దారం అవుతుంది  పోరు పోరుని పెంచుతుంది  పొందు లాభాని చేకూరుస్తుంది  పగల సెగలవల్ల ప్రజలు బాధపడరా. ప్రతి యుగంలోనూ పద్ధతులు మారుతూ ఉంటాయి అన్న విషయం  తెలియనిది కాదు కదా  స్మృతులు మనకు ఏమి చెప్పాయో వాటిని ఒక్కసారి మనసులో తలుచుకో  కానీ బాటలో కాలు మోపితే  అడుసు ఊబి మనలను హరిస్తోంది  శాంతి అహింసలే మనకు సరియైన వస్త్రాలు ఆ పగలు లేనట్టి ఆయుధాలు కూడా ప్రజలను ఏకం చేసి పరపాలకులను పారద్రోలు అంటే సత్యాగ్రహం  చేయవలసిన అవసరం లేదు ఎంతో ఉంది  వస్తువులను అమ్ముకోవడానికి వచ్చిన వారు  ఆ వస్తువులను  ప్రజలు కొనకపోతే  ఏం జరుగుతుంది  వచ్చిన త్రోవనే అనే వెళ్ళిపోతారు మన వస్త్రాలు మనమే తయారుచేసి ఖద్దరు ధరించి  మన జీవితాన్ని గడుపుకోవాలి  విదేశ వస్తువులను  వారి వెంటపడి కొనుగోలు చేసినట్లయితే మన దేశంలో తయారవుతున్న వస్తువు లేమి కావాలి.


కామెంట్‌లు