మండోదరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 కానీ భర్త దయనీయ దుర్గతి అతని మోహపాశం గురించి మిక్కిలి దుఃఖిత కావడం చేతనే ఇలా మాట్లాడి ఉంటుందని భావించాలి  ఇందులో అతిశయోక్తి లేదని కూడా అనిపిస్తుంది హనుమాన్ లంకలో రావణుని భవనంలో మూలమూలన సీత కొరకు అవేక్షిస్తాడు వారి శ్రేయ గృహంలో మండోదరిని చూసినప్పుడు హనుమాన్ మండోదరి సీత దేవి లాగా కనిపిస్తోంది దీనివల్ల మండోదరి సహజ సౌశీల్యం మనకు బోధపడుతుంది రావణుని వద్ద మండోదరి నిమించిన ఎందరో సుందరకాంతమణులు ఉండడం హనుమాన్ గ్రహించాడు  కానీ మండోదరి లోని అత్యంత భాహ్య సౌందర్యాన్ని మించిన దివ్యమైన వెలుగు ఆమె అంతరంగంలో ప్రకాశిస్తూ ఉండడం వల్లనే హనుమాన్ కు  మండోదరి సీతలా దర్శనమిచ్చింది. మండోదరిలో నిబిడీ కృతమైన ఆమె పతివ్రత ఔదార్య శీలతే ఇందుకు కారణం. మండోదరిని క్షణకాలం సీతాదేవి రూపంలో దర్శించి హనుమాన్ వివేకం తెచ్చుకొని అసలు సీతాదేవి అన్వేషణలోనే నిమగ్నుడౌతాడు ఇక్కడ ఈ సంఘటన వల్ల మండోదరి వ్యక్తిత్వ వైశిష్యమునకు శుభోదకం అవుతుందని అని అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటన ద్వారా రామాయణ కథాక్రమంలో మందోదరి ఈ సంఘటనలోనే ప్రథమంగా మనకు కనిపిస్తోంది హనుమాన్ తోనే రామాయణ పాఠకులు రావణుని అంతః పురాన్ని  ప్రథమంగా దర్శిస్తారు తదనంతరమే బహుశా రావణ సంహారం తరువాతనే మడోసారి కనిపిస్తోంది ఈ మధ్యలో ఏదో ఒక సంభాషణలో చాలా మారిన పేరు బదులుగా మండోదరి పేరు వచ్చింది పొరపాటుగా లంకలోని అశోకవనంలో నిర్బంధించబడిన సీతా  దేవిని చూడడానికి ప్రతినిత్యం  ఉదయాన్నే రావణుడు తన నారీ పరివారంతో వస్తుండేవాడు. సీతాదేవి పట్ల వ్యర్థ ప్రేమ ప్రేలాపనలు చేస్తూ నిరాశతో తిరిగి వెళుతూ ఉండేవాడు అనుమానం లంకా ప్రవేశం చేసిన రోజు కూడా రావణుడు నిత్యం మాదిరిగానే ఉదయాన్నే సీత దేవి వద్దకు వెళతాడు ఆ సమయంలో హనుమాన్ అక్కడే ఉంటాడు కానీ అక్కడే ఉన్న శింశుపా వృక్షం పైన ఆకుల మధ్య దాగి ఉండి క్రింద జరిగే విషయాలను చూస్తాడు మాటల్ని వింటాడు రావణుడు ఎంత బలవంతం చేసిన ప్రాచీయపడిన సీతాదేవి నిరాకరించింది గడ్డి పోసల తిరస్కరించింది రావణుడు క్రోధాగ్నితో దహించిన వాడై సీతా దేవిని హతమార్చుటకు తన కలవాలాన్ని తీస్తాడు కానీ  అంతపురం స్త్రీలు మరియు ముఖ్యంగా ఒక అత్యంత సౌందర్యరాశి అయిన స్త్రీ నచ్చ చెప్పడంతో రావణుడు అశోక వనాన్ని వదిలి అంతః పురం వైపు వెళ్తాడు. ఈ అతిలోక సుందరిని వాల్మీకి మహర్షి  ధాన్యమాలిని అని వర్ణిస్తాడు. 

కామెంట్‌లు