కనుక మనము తయారుచేసిన వస్తువులను మనమే కొని తయారు చేస్తున్న వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మన భుజస్కాంతాలపై ఉన్నదా లేదా ఆలోచించు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మనకు బంధువులు అన్న విషయాన్ని మొదట పెట్టుకో కడజాతి కడజాతి అని సమాజానికి దూరంగా ఉంచిన అనేకమంది సోదరులను కలుపుకొని పోవాలి ఇలా విడిగా ఉండడం వల్ల శత్రువులకు లోకువ అయిపోతాం మనలను జయించడం వారికి చాలా తేలిక అవుతుంది తరతరాల నుంచి వస్తున్న తప్పుడు నీతుల్ని మనం అనుసరించడం పెట్టడం చేస్తున్న వారిని ప్రేమించడం జరుగుతూ ఉంటుంది కొత్త జాతిని మలచాలి అవియే మనం యుద్ధంలో గెలవడానికి శస్త్రాల్లాగా ఉపయోగిస్తాయి కనుక ఓ వీర కుమారా సీతారామ రాజా ఈ వనంలో పోరుబాట వదిలిపెట్టు అది మనకు చాలా మేలు అవుతుంది ఏ విధంగా చూసినా త్వరలో స్వాతంత్ర్యాన్ని తెచ్చే భరతావనికి ఇది పనికిరాదు అని చెప్పిన గాంధీ తత్వాన్ని విని రాజుకుమనసులో అనేక సందేహాలు పుట్టుకొస్తున్నాయి ఎంతో వినయంతో బాపూజీకి మొక్కి బాపూజీ నీ మాట వింటాను అని ఎంతో వేడుకతో పలికి ఆ మాటలను బాపూజీ ప్రక్కనే ఉన్న నెహ్రూ జీవిని ఎంతో ఆదరంతో స్నేహశీలతతో వీరుని చేయి పట్టుకొని ధన్యుడవు వీరుడా నిన్ను కన్నతల్లి వీరమాతగా నిల్చు ఈ జగతిలో. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ అతని ప్రక్కకు వచ్చి కౌగిలించుకొని సోదరా కనులారా నిన్ను చూశాను భారత శౌర్యాన్ని చాటిన భ్రాతవు నీవు అన్ని యుగాలలో నీ అమర చరిత్ర నిలిచి ఉంటుంది అక్కడ చేరిన నాయకులు అందరూ రాజును చూసి ఆశీస్సులు ఇచ్చి పులకించిపోయాడు వారందరికీ మ్రొక్కి అతడు ఆనందాన్ని అనుభవించాడు సభ అలా సాగింది. రామరాజు వచ్చాడట వెళ్ళిపోయాడట అని తెలిసి సబికులందరూ కూడా నిరాశ చెందారు కాపలాలు ఉన్న పోలీసులు రాజు ఎటు నుంచి వచ్చాడో ఎటు నుంచి వెళ్ళిపోయాడో తెలియక తికమక పడిపోతున్నారు పంజాబ్ సిక్కుగా బాల వీరుడు వచ్చి గాంధీని కలిశాడని ఒక కథ ప్రచారంలో ఉంది నాయకులకు తప్ప సామాన్యులైనట్టి జనులకు అతని జాడ తెలియదు.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి