ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 రాజు గారి మాటలు వినగానే అమాయకుడైన బాబు  అలాగే చేస్తాను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి  పోలీస్ స్టేషన్ వరకు  అక్కడ కనిపించిన పోలీసులకు రాజుగారు చెప్పిన మాటలన్నీ చెప్పేసరికి  వాళ్లు  కలవర పడిపోయారు  పాతికమంది మలబారు పోలీస్ అల్వార్ నాగ్ ఆధిపత్యం లో వచ్చి చేరారు  రాజు దగ్గరికి వేగంగా వచ్చి చుట్టుముట్టారు  కానీ వారి దగ్గరకు వెళ్లడానికి ఎవరికీ గుండెలు లేవు. నాలుగు ప్రక్కల తిలకించి రాజు నవ్వుతూ  ఇక్కడకు రావడానికి ఎందుకు చంపుతున్నారయ్యా మీకు ఏమీ భయం లేదు  మీరు నన్ను బంధించవచ్చు  బంధించిన మరుక్షణం రాజును  కనుకొన్నారు బందీగా తీసుకువచ్చారు అనే ఖ్యాతి మీకు దక్కుతుంది రండి  అంటూ ఆహ్వానించాడు రాజు.ఎంతో అనునయంతో చెప్పిన రాజుగారి మాటలు విని దగ్గరకు వచ్చారు  వారిలో రాజును బంధించడానికి  భయపడిపోతున్నారు  మధ్యలో మాయమైపోతాడేమోనని ఒక మంచాన్ని తెప్పించి దానిమీద పడుకోబెట్టి  గట్టిగా  తాడుతో  బంధించి  అతని ఒంటిపై ఏమాత్రం ఖాళీ లేకుండా ఉండేట్లుగా ఏర్పాటు చేసుకొని  కొయ్యూరు లో ఉన్న సైనిక క్యాంపుకు మోసుకుని వెళ్లారు  ఎంతో ఆనందంతో  అక్కడ ఉన్న వాళ్లంతా అస్సాం సైనికుడు  మేజర్ గూడాల్ అన్న మూర్ఖుడు ఒకడు ఉన్నాడు  అక్కడ అతను  ఆ క్యాంపుకు మొత్తానికి  అధికారి  రాజును  అతని ముందుకు తీసుకువచ్చి  గుడాలుకు అప్పచెప్పారు  వాడు తెచ్చి పెట్టుకున్న  స్వరంతో  అయ్యయ్యో వీరుని అలా చేయకూడదు అయ్యా ముందు కట్లువిప్పండి అన్నాడు. కట్లు విప్పిన తర్వాత మంచం పై కూర్చోబెట్టి  చిలిపి తనంతో ఎకసెక్కాలు ఆడడం మొదలుపెట్టాడు  నీలాంటి వాడు మా నీడకు చేరితే  కర్నల్ ను చేసి గౌరవిస్తాం  ఈ ప్రయాసనీకెందుకయ్యా  మమ్మల్ని నువ్వు ఏం చేస్తావ్  గుడ్డివాడు చూడగలడా నీవే చెప్పు  ఎంతో అతిశయంతో పెరుగుతున్న అతని మాటలను  విని అలవోకగా నవ్వి  పని గట్టుకుని నేనుగా  పట్టుబడ్డాను కానీ మీ వారు వచ్చి  100 మంది అయినా నన్ను బంధించగలరా  కోతి లాగా దూకుతూ కోతలు కోస్తూ  నీ అంత గొప్పవాడు లేడని మీ అంతట నీవే సొంత డబ్బా ఊదుకోకు  నన్ను బంధించడం మీ అబ్బ తరమా  మీ పాలన ఇంకా ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నావు  సరిగ్గా 20 సంవత్సరాలు  ఆ పైన ఇది మా రాజ్యం అవడం సత్యం ఖాయం.

కామెంట్‌లు