త్రిజట;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 రావణుడు తప్పుడు మాటలు పలుకుతాడు ఇలా చేస్తూ చేస్తూ దుర్గంధ అంధకార బంధురమైన అగాధలోయలో మునిగిపోతాడు అక్కడి నుంచి అతనిని ఒక నల్లని అంధ వికారమైన స్త్రీ దక్షణం వైపు తీసుకుని వెళ్ళిపోతుంది  కుంభకర్ణుడు కూడా ఇదే స్థితిలో కనిపిస్తాడు రావణుని పుత్రుడు కూడా ఇదే విధంగా గొరిగిన తలతో నూనె పోసిన శరీరంతో వికృత ఆకారంలో కనిపిస్తాడు రావణుడు ముళ్ల పంది మీద కూర్చొని వెళుతున్నట్లుగా కనిపిస్తుంది కుంభకర్ణుడు ఒంటె మీద అయితే ఇంద్రజిత్తు సుమ్స్ మీద కనిపిస్తారు మాత్రం నిరాహాపదా మరియు ప్రసన్న చిత్తంతో కనిపిస్తాడు శ్వేత వస్త్రం శ్వేతమాల మరియు శ్వేత చత్నంతో సుశోభితుడైన విభీషణుని యొక్క శరీరం  చందన చర్చితమై ఆకర్షణీయంగా ఉంటుంది.
నలువైపులా సంగీత రిక్షా మంగళమయ దృశ్యాలు కనిపిస్తాయి దివ్య గజరాజు పై ఆసీనుడైన విభీషణ యొద్దకు వినయశీలురైన ఆయన సచీవులు రావడం కనిపిస్తుంది  స్వప్నం చివర రావణుని ద్వారా ఇప్పటివరకు పరిరక్షించబడిన లంకా నగరం యొక్క దుస్థితి వర్ణించబడింది  శ్రీరాముని దూతగా లంకలో ప్రవేశించిన ఒక వాహనరుని ద్వారా లంక వినాశనాన్ని త్రిజట తన స్వప్నంలో చూస్తుంది గజబలము రథ బలము మొదలైన వాటితో లంక సర్వస్వం సముద్రంలో మునిగిపోతుంది  రాక్షస స్త్రీలందరూ లంకను బస్మి భూతం  గావించి వికటా టహాసం చేస్తారు నాట్యం చేస్తారు త్రిజటతార స్వప్నంలో చూసిన ఈ విషయాలన్నీ తన స్నేహితులకు చెప్పి వీటి విముక్తికి జానకిని శరణు వేడుకోవడం తప్ప వేరే మార్గాంతం లేదని హెచ్చరిస్తుంది. తన స్వప్నం త్వరలో సాకారం అయిపోయే క్షణాలు దగ్గరలో ఉన్నాయని తెలుసుకున్న త్రిజటకు మృదుల ప్రకృతి స్వరూపిణి జానకి ఔదార్యం పై సంపూర్ణ విశ్వాసం ఉంది. జానకి ఎదుటకు వెళ్లి ఒక నమస్కారం చేస్తే చాలు ఆమె సంతసించి సాయపడుతుంది. త్రిజట స్వప్న సూచకల మేరకు అన్నట్లుగా సీతాదేవి అవయవాలలో కొన్ని శుభ సూచక లక్షణాలు గోచరించడం మొదలైనాయి. మొక్కలను ఎడమ భుజము అకస్మాత్తుగా కొట్టుకుంటున్నాయి ఎదురుగా చెట్టు మీద ఉన్న పక్షి తీయని రాగాలు ఆలపిస్తుంది సీత అంటుంది అది నిజమైతే మీరు భయపడవలసిన అవసరం లేదు  ఈ విధంగా త్రిచట స్వప్నం అందరిని  అస్వస్తులుగా చేస్తోంది ఈ ఆస్వాసనం యావత్తు రాముని కథలో ఆయనమున కన్నా మహత్వ పూర్ణ స్థితిని తెలుపుతుంది. సుందరకాండ రామాయణానికి కేంద్రబిందువైతే త్రిజట స్వప్నం సుందరకాండ సౌందర్యానికి కేంద్రం.

కామెంట్‌లు