ఏక సందాగ్రాహి వేంకట రాజుగారు;- -ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,9492811322.
 మేమంతా భయస్తులమని భావించవద్దు  మీ త్యాగం నీ స్నేహం ఏ రీతిగా మేము మర్చిపోతాం  నీ ఆజ్ఞాపిస్తే మాలో ప్రతి ఒక్కరూ నిప్పులలో దూకి ఆత్మహుతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం  ఎందుకోసం ఏ ఒక్కరు కూడా వెనుకాడరు  నీతి చరిత్ర కలిగిన నీవు యతమో అని నమ్ము అన్నా  అంటూ పలికిన వారిని అనుగ్రహిస్తూ  రాజు తమ్ములారా వేరే దారి లేదు  కనక ప్రజలలో కలిసిపోవడమే  మీరు చేయవలసిన పని  నేను ఆత్మార్పణ చేసుకోవడానికి వెళ్ళిపోతాను అన్న తరువాత అన్ని దళాలు చేరి ఆలోచన చేసి  ఎంతో ప్రేమతో  రాజుతో ఇలా అన్నారు  మనమందరము ఒక్కటై ఆత్మార్పణ చేసుకుందాం  వీర ధర్మాన్ని నెరవేరుస్తూ ఈ జీవితాలను అంతం చేసుకుందాం అన్నారు అనిi నిర్ణయించుకున్న వారితో రాజు  నేను సన్యాసిని నాకు ఈ బ్రతుకు దేనికి  నా తల్లి నుంచి నేను ఆజ్ఞను పొందాను  ఆ తల్లి దీవించి ఆరోజునే నన్ను వదిలి వేసింది  నేను సంసారి ని కాను సర్వ స్వతంత్రుడను  గుడ్డు గోదలున్న గృహస్తులై ఉండి మీరు పెండ్లాము పిల్లలు బంధుజనులు  మీకోసం ఎన్నో ఆశలతో  జీవిస్తూ ఉన్నారు  వారిని దుఃఖపు పాలు చేయకండి  కనుక మీరు ఇక్కడ నిలువక మీ  స్వగృహాలకు వెళ్లిపోండి  మీరు బంధువులను చేరితే వారందరూ ఎంతో ఆనందిస్తారు  పావనులైన మీకు వారందరూ ప్రేమలు పంచుతారు  అన్న క్షణాన రాజుతో చరవుగా ఉండే ఒక మన్యవాసి  దగ్గరకు వచ్చి రాజా  మా నాయక స్వామి నేను చెప్పేది విను  నా విన్నపాన్ని విని దానికి న్యాయం చెయ్ అన్నా నీకు నాకు  ఎన్నో పోలికలు ఉన్నాయని ప్రజలందరూ అంటూ ఉంటారు  నన్ను అనేక పర్యాయాలు నీవే అనుకుని  వారు మాట్లాడుకుంటున్న మాటలు నేడు విన్నాలయ్యా  నాకోసం ఏడ్చేవారు ఈ లోకంలో ఏ ఒక్కరూ లేరు నేను ఏకాకిని  నీకోసం నేను ప్రాణాలను ఇస్తాను  నీవు మాత్రం జనుల చికాకులను తొలగించి చింతలు పోగొట్టడానికి జీవితాన్ని కొనసాగించాలి  అని పలికిన ప్రాణ స్నేహితుని చూసి  మనసులో ఎంతో ఆనందించి  మాన్యుడైన రాజు  ఇలా అంటున్నాడు  సోదరా నేను కలలోనైనా నీకు అన్యాయం చేస్తానా  నీవు ఉన్నావని తెలుసు  నీకు అన్యాయం చేయడం కోసమేనుంది  నన్ను చూసి నవ్వుకోడానికా ఈ పన్నాగం  ఈ దేహాన్ని కాపాడుకుంటే ఏమవుతుంది  సోదరా అన్నాడు.
కామెంట్‌లు