సర్వం నువ్వే;- :గుండాల నరేంద్ర బాబుతెలుగు సాహిత్య పరిశోధకులుశ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి=సెల్ :9493235992
పల్లవి :
ఎక్కడమ్మా నీవు లేనిది
ఏమిటమ్మా చేయలేనిది
నేల నీదే నింగి నీదే
నింగినేలా నడుమ నీదే 
చరణం :1
జగతికి ఆధారం నీవే
ప్రగతికి ఆధారం నీవే
సృష్టికి ప్రతి సృష్టి నీవే
దృష్టికి సమభావన నీవే
చరణం :2
మమతకి ఆదర్శం నీవే
సమతకి శ్రీకారం నీవే
ఆకృతి ఆలంబన నీవే
సుకృతి శుభదీవెన నీవే
చరణం :3
ప్రేమకి ప్రాకారం నీవే
జన్మకే సార్ధకం నీవే 
ప్రకృతి ప్రతిరూపం నీవే
సంస్కృతి ప్రతిబింబం నీవే
చరణం :4
వికృతి విరుగుడే నీవే
విశ్రమించని జీవే నీవే 
విజయ సంకేతమే నీవే
వెలలేని పరిశ్రమే నీవే
చరణం :5
నిస్వార్ధ నిలువెత్తు రూపం
నిదర్శనమే బ్రతుకు మొత్తం
ఆత్మీయ ఆతిథ్యమే నిత్యం
అమృతమే ఆ చేతి వంటకం

====================================
( మార్చ్ 08అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాసిన గీతం )
కామెంట్‌లు