తెలంగాణ ధిక్కార కవి కాళోజీ (కవిత)- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640 748497
 తెలంగాణ ధిక్కార కవి
తూర్పున పొద్దైపొడిచినరవి
అతడేఅతడేకాళోజీ
 మనగొడవకవికాళోజీ
అన్యాయాన్నెదిరించినోడే
ఆరాధ్యుడు అన్నోడు
పుట్టుక నీదిచావునీదని
బ్రతుకంతా దేశానిదన్నోడు
అనునిత్యం తెలంగాణమే
అతనిఆశశ్వాసగబ్రతికినోడు
అనైక్యతను ఏకంచేసినవాడు
తెలంగాణ కై పోరునడిపినోడు
ఆంధ్ర పాలకులదోపిడినంత
ఎండగట్టిన పోరాట యోధుడు
మనతరంతోముందడుగేసిన
సమకాలికుడు సామాజికుడు
ప్రశ్నించడం నేర్పినవాడు
నిరసన జెండానెత్తినోడు
అడుగడుగునా దోపిడీని
ఎండగట్టెనుమనకాళోజీ
కవి కలము నిప్పులు కక్కేను
ఒక్కసిరా చుక్క లక్ష మెదళ్ళకదలికనెను
జాతీయ కవిత్వానికి
దిక్సూచిగా నిలిచెను

రచన
అంకాల సోమయ్య
దేవరుప్పుల
 జనగామ
9640748497
[1:18 pm, 7/03/2024] Somaiah Ankaala: స్నేహితుడు
 (హితం కోరువాడు)
@@@@@@@
తల్లి
తండ్రి
 గురువు
ఆ తర్వాత స్థానం
స్నేహితుడు
మనహితం కోరేవాడు
ఎటువంటి రక్తసంబంధం
ఎటువంటి రాగ బంధం
ఎటువంటి బంధుత్వం
లేని అజరామరమైన బంధం
తల్లి కుమారుడి కడుపాకలి చూస్తుంది
తండ్రి కుమారుడి ఎదుగుదలను చూస్తాడు
గురువు  అజ్ఞానాంధకారం బాపి
జ్ఞానాంజన దిద్దుతాడు
స్నేహితుడు మన మనసెరిగి
మన కళ్ళలోని ఆర్తి చూసి
అపన్నా హస్తమందించి
బాధలోఓదార్పునిచ్చి
మన సంతోషంలో భాగమై
మన దుఃఖంలో  భుజం తట్టి
నేనున్నానని
 ధైర్యాన్నదించి
కడవరకు కట్టే కాలే వరకు
మనల్ని వీడని
మన నీడగా
వెన్నంటి నడిచేదే
నిజమైన స్నేహం
అటువంటి స్నేహితులకు
మనఃపూర్వక వందనం

కామెంట్‌లు