నేను కవిని;- అంకాల సోమయ్య దేవరుప్పుల-జనగాం-9640748497
నేను కవిని
సామాజిక పరివర్తకుడిని

నేను కవిని
సమ సమాజ నిర్మాతను

నేను కవిని  
బక్కచిక్కినవాణ్ణి
సామాజిక సమస్యల్ని ఏకరువుపెట్టేవాడిని

అయినా
 కడుపాకలి తీర్చుకోలేక నిత్యం
తండ్లాడుతున్న వాడిని

నేను కవిని 
బడుగు బలహీనులకు
నేను బాసటగా నిలిచేవాడిని

నేను కవిని
సమస్యల  వలయంలో చిక్కుకున్న సమాజానికి
దిశానిర్దేశం చేసే వాడిని

నేను కవిని
ప్రజాపక్షపాతిని

నేను కవిని 
ప్రజలు ఎన్నుకొనని
ప్రజా ప్రతినిధిని

నేనుకవిని
నేను ఏ ఒక్కరి కోసం మో పరితపించే వాడిని కాదు 
నేను అందరివాణ్ణి

కామెంట్‌లు