బురద నుండి
బువ్వ దీసెటోడు
మోసపుఎత్తుదెలియని
ధర్మాత్ముడు
వట్టిసత్తెకాలపు
సత్తెయ్య అతడు
నేలతల్లినినమ్మినోడు
నీతి న్యాయం దప్పనోడు
అతివృష్టి అనావృష్టి
వెంటాడినా--?
వడగండ్ల వానతో
కడగండ్లు బ్రతుకున
కళ్ళారజూసినోడు!
గింజ ధాన్యం అమ్మకములో
నిట్టనిలువుగా మోసపోయిన
అమాయకుడు ఈకర్మవీరుడు!
కష్టమైనా ,నష్టమైనా
కన్నతల్లి లాంటి భూమిని
తెగనమ్మనోడు
భూమి పుత్రుడే ఇతడు
అందరూకొనియాడే---
అన్నదాతే యితడు--+
అన్నానికి తండ్లాడుతున్న--
కటిక దరిద్రుడు
పండగయ్యేనా?! రైతు బ్రతుకు!?
కృషివలుని కృషికి ఫలితందక్కేనా?!
ఎప్పుడొచ్చునో ?రైతు రాజ్యం!?2
శ్రమజీవనసౌందర్యం
ఏనాటికి గుర్తించెదరో?!
రైతు రాజయ్యేరోజెప్పుడో?!
కర్మజలానికి, ధర్మజలానికి
ఖరీదెవడు కట్టునో?!
సమీపమున---
భవిష్యత్తున్నదో!!
లేదో?!
మోసపోవడానికి
అలవాటు పడ్డ
వట్టి వెర్రిబావులోళ్ళు
భూతల్లిపై వల్లమాలిన అభిమానం చూపెటోళ్ళు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి